Politics

జగన్ మంత్రి వర్గంలో కోటీశ్వరులు ఎందరో తెలుసా ?

ముఖ్యమంత్రి జగన్ సారధ్యంలోని ఎపి ప్రభుత్వంలో జగన్ తో కలిపి మొత్తం 25మంది మంత్రులున్నారు. ఇందులో సంపన్న వర్గానికి చెందిన మంత్రులెవరు, పేదలెందరు, వాళ్ళ వాళ్ళ ఆస్తులు,అప్పులు ఎంతెంత వంటి విషయాల్లోకి వెళ్తే,అసోసియషన్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ సంస్థ ఓ ఆసక్తి కరమైన నివేదిక బయట పెట్టింది. ఆ లెక్కల ప్రకారం అత్యంత ధనవంతుడైన మంత్రిగా జగన్ ని తేల్చారు. ఈయన ఆస్తుల విలువ 510కోట్ల రూపాయలు. 

ఇక ఆతర్వాత స్థానానికి వస్తే,సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆస్తుల విలువ 130కోట్ల రూపాయలు. ఈయన 20కోట్ల అప్పుతో మొదటి స్థానంలో ఉన్నారట. ఇక మూడవ స్థానంలో61కోట్ల రూపాయలతో నెల్లూరు జిల్లాకు చెందిన మేకపాటి గౌతమ్ రెడ్డి ఉన్నారు. ఇలా చూస్తే 88శాతం మంది కోటీశ్వరులేనని చెప్పాలి. వీళ్లందరి సగటు ఆస్థి విలువ 35.25కోట్లుగా తేల్చారు. 

పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మంత్రి శ్రీరంగ నాధ రాజుకి 12కోట్ల అప్పులున్నాయట. మంత్రి అవంతి శ్రీనివాస్ కి 5కోట్ల రూపాయల అప్పులున్నాయని నివేదిక తేల్చింది. ఇక 17మంది మంత్రులపై క్రిమినల్ కేసులున్నట్లు కూడా వారి వారి ఆఫేడివిట్ ల ఆధారంగా అసోసియషన్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ సంస్థ నివేదిక చెబుతోంది.