జయసుధ విజయ నిర్మల మధ్య సంబంధం ఏమిటో తెలుసా?
ప్రముఖ నటి, దర్శకురాలు, ప్రముఖ నటుడు సూపర్ స్టార్ కృష్ణ సతీమణి విజయనిర్మల ఇకలేరు. 73ఏళ్ళ విజయనిర్మల గత కొంతకాలంగా అస్వస్థతతో ఉన్న ఆమె గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ, బుధవారం రాత్రి గుండెపోటుతో మరణించారు. 1946 ఫిబ్రవరి 20న ఆమె తమిళనాడులో జన్మించారు. విజయనిర్మల తండ్రిది స్వస్థలం చెన్నై కాగా, తల్లిది గుంటూరు జిల్లా నరసరావుపేట. తన మొదటి భర్త కృష్ణమూర్తితో విడిపోయి, ఆతర్వాత సూపర్ స్టార్ కృష్ణను రెండో వివాహం చేసుకున్నారు. ప్రముఖ నటుడు నరేష్ ఈమె కొడుకే. సహజ నటి జయసుధకు ఈమె పిన్ని. విజయశాంతికి బంధువే. వీరిద్దరూ విజయనిర్మల మరణంతో షాక్ కి గురయ్యారు. విజయ నిర్మల మరణంతో సినీ వర్గాలు,రాజకీయ ప్రముఖులు, ఫాన్స్ ని కూడా దిగ్భ్రాంతి చెందారు.
విజయ నిర్మల తల్లి శకుంతల. వసంతరావు, సంజీవరావు అనే ఇద్దరు సోదరులున్నారు. పాతూరులోనే చాలాకాలం ఉన్నారు. ఈమె బాల్యం అక్కడే గడిచింది. రాజావారి కోటలో చిన్నతనంలో డాన్స్ ప్రోగ్రాం ఇచ్చింది. తల్లిదండ్రులతో కల్సి చెన్నై వెళ్లిన ఈమె ఏడేళ్ల వయస్సులో మత్సరేఖ మూవీతో బాలతారగా తమిళ సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. 11వ యేట పాండురంగ మహత్యంతో తెలుగు సినీరంగంలోకి ప్రవేశించింది. రంగుల రాట్నం మూవీతో హీరోయిన్ అయింది. సుమారు 200కి పైగా మూవీస్ లో ఆమె నటించారు.
తెలుగు ,తమిళ,మళయాళ మూవీస్ లో తన ప్రతిభను చాటిన విజయనిర్మల 1971లో మీనా మూవీతో డైరెక్టర్ అయ్యారు. 2009వరకూ 44సినిమాలకు దర్శకత్వం వహించారు. దేవదాసు,దేవుడే గెలిచాడు,రౌడీ రంగమ్మ,మూడు పువ్వులు ఆరుకాయలు,హేమాహేమీలు,రామ్ రాబర్ట్ రహీం , సిరిమల్లె నవ్వింది ,భోగిమంటలు,లంకె బిందెలు, రెండు కుటుంబాల కథ సినిమాలకు దర్శకత్వం వహించారు. 2002లో అత్యధిక చిత్రాలు రూపొందించిన మహిళా డైరెక్టర్ గా రికార్డు కెక్కడంతో పాటు గిన్నీస్ బుక్ లో కూడా అత్యధిక చిత్రాలు చేసిన మహిళా డైరెక్టర్ గా రికార్డ్ నమోదు చేసుకున్నారు. 2009లో సూపర్ స్టార్ కృష్ణ హీరోగా తెరకెక్కిన నేరము-శిక్ష చిత్రం దర్శకురాలిగా ఆమె చివరి చిత్రం.