Movies

కృష్ణ రెండో భార్యగా వచ్చిన విజయ నిర్మలతో కుటుంబం ప్రవర్తన

ఈరోజుల్లో భార్య భర్తలకే సరిగ్గా పొసగని వ్యవహారం చూస్తుంటాం. అయితే ఏకంగా ఇద్దరు భార్యలున్నా సరే , ఎక్కడ గొడవలు లేకుండా అన్యోన్యతగా జీవించడం సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీని చూసి నేర్చుకోవాలి. ఇందిరా దేవితో పెళ్లయిన కృష్ణ,ఆతర్వాత సహనటి విజయనిర్మలను పెళ్లాడారు. ఇలా చేసినందుకు మొదటి భార్య ఏమీ అనుకోలేదు సరికదా విజయనిర్మలను ఆదరించింది. అలాగే ఇందిరాదేవిని కూడా విజయనిర్మల ఆదరణగానే చూసింది. ఒకరితో పెళ్లయి,బిడ్డను కన్నాక విడాకులు తీసుకున్న విజయనిర్మలను పెళ్ళాడినందుకు ఇంకో కుటుంబంలో అయితే పెద్ద గొడవలు అయ్యేవి. కానీ కృష్ణ ఫ్యామిలీ లో అలాంటి వాటికి చోటు లేదు. 

విజయనిర్మల మొదటి భర్తతో పుట్టిన నరేష్ ని ఎంతో క్రమశిక్షణతో పెంచుతూనే కృష్ణతో కాపురం చేసినా, మొదటి భార్య పల్లెత్తు మాట అనలేదు. అలాగే మొదటి భార్యతో సంసారం చేసి పిల్లలను కన్నప్పటికీ విజయనిర్మల ఏమీ అనుకోలేదు. ఇలా ఇద్దరు భార్యలు ఎడ్జెస్ట్ అయ్యి,తెలుగు వారి కుటుంబాల్లోని అరుదైన చరిత్ర సృష్టించారు. విజయ నిర్మల దర్శకురాలిగా అవతారం ఎత్తితే కృష్ణ ప్రోత్సాహం అందించారు. మొదటి భార్య పిల్లలను కూడా ఎక్కడా నిర్లక్ష్యం చేయలేదు. 

దేవదాసు సినిమా డైరెక్ట్ చేయడం అది పెద్దగా ఆడకపోవడంతో అప్పటి నటి వాణిశ్రీ చేసిన కామెంట్స్ కి విజయ నిర్మల కు కోపం వచ్చి ఆమెతో మాట్లాడ్డం మానేశారు. కృష్ణ సరసన నటించే హీరోయిన్ తోనే విజయనిర్మల ఇలా ఉంటె ఇక ఇంట్లో ఎలా ఉంటుందో అనుకుంటాం కానీ ఇంట్లో ఎప్పుడూ కుటుంబ విలువలు పాటించారు. అందుకే తెలుగు లోగిళ్ళలో ఎక్కడా కానరాని ఇద్దరు భార్యల తో చక్కని కాపురం కృష్ణ ఫ్యామిలీలో వింతగా కనిపిస్తుంది. ఎప్పుడో రాజుల కాలంలో ఇద్దరు భార్యలతో అంతకన్నా ఎక్కువమందితో సంసారం ఉండేదని అంటారు కానీ ఈకాలంలొ కృష్ణ ఫ్యామిలీ  అందుకు మంచి ఉదాహరణ.