Movies

సింగర్ చిత్ర భర్త గురించి ఎవరికి తెలియని కొన్ని నిజాలు

లేకలేక పుట్టిన బిడ్డను  అల్లారుముద్దుగా చూసుకుంటున్న సింగర్ చిత్రకు తీరని వేదన మిగిల్చింది. పాపను తీసుకుని భర్తతో సహా దుబాయి లైవ్ ఈవెంట్ కి వెళ్లిన చిత్ర పుట్టేది దుఃఖంతో తిరిగొచ్చింది. కళ్లెదుటే కూతురు నీళ్లలో మునిగిపోయి ప్రాణాలు కోల్పోతే కలిగే బాధను ఎలా చెప్పగలం. అందుకే ఆమె షాక్ నుంచి తేరుకోడానికి చాలా సమయమే పట్టింది. పెళ్లైన చాలా కాలానికి పుట్టిన పాప బుడిబుడి అడుగుల వయస్సులోనే నీటి గుండానికి బలవుతుందని, ఇలాంటి విషాదం సింగర్ చిత్రను వెంటాడుతుందని ఎవరూ ఊహించి వుండరు. 

కూతురే ప్రాణంగా, పాటలే జీవితంగా సాగిపోతున్న ఆమెకు ఇలాంటి ఇబ్బంది వస్తుందని ఎవరనుకుంటారు. పగవాళ్ళకి కూడా ఇలాంటి కష్టం కలగకూడదని అనుకోవడం మినహా ఎవరూ ఏమీ చేయలేం. అయితే కూతురి హఠాన్మరణంతో కుంగిపోయిన చిత్ర ఒప్పుకున్న పాటలు వదిలేసి,కచేరీలు వాయిదా వేసేసారు. కూతురి చిత్ర పటం ఎదుట కూర్చుని గుండె పగిలేలా రోదిస్తూ కూర్చున్నారు. ఎంతోమంది ధైర్యం చెప్పినా ఫలితం కానరాలేదు. అయితే, మళ్ళీ మామూలు మనిషి అయ్యిందంటే అందుకు ఆమె భర్త విజయ్ శంకర్ కారణమని చెప్పాలి.

భార్యను ఓపక్క ఓదారుస్తూ మరోపక్క తనలో తాను కూతురికోసం కుమిలిపోయేవారు. ఎందుకంటే పాటలకు ఎక్కువ సమయం చిత్ర బయటకు వెళ్తే కూతురితో ఎక్కువ సమయం వెచ్చించిన మనిషి ఈయనే కదా. అందుకే  చిత్రలో ధైర్యం నింపడం కోసం తన బాధను తనలోనే తాను దిగమింగుకోవడం విజయ్ శంకర్ కే చెల్లింది. రకరకాల మానసిక వైద్యులను సంప్రదించడం, బయట ప్రపంచంలోకి మళ్ళీ తీసుకెళ్లడం,కూతురు జ్ఞాపకార్ధం స్నేహ నందన ఫౌండేషన్ కి సలహా ఇచ్చి,ఆస్తులు పోయినా కూతురిని చూసుకుందాం అని ధైర్యం చెప్పిన ఇలాంటి భర్త దొరకడం చిత్ర అదృష్టమని చెప్పాలి. ఎందుకంటే ,స్వయంగా చిత్ర ఇదే మాట పలు ఇంటర్యూలో చెప్పడం పరిపాటి అయింది.