కృష్ణ ,విజయ నిర్మల ఎందుకు పిల్లల్ని కనలేదో తెలుసా…???
సూపర్ స్టార్ కృష్ణను విజయనిర్మల తన చివరి శ్వాస వరకూ ఎంతో అల్లారుముద్దుగా చూసుకుంది. వెన్నెముక నొప్పి వస్తే చిన్నపిల్లాడిలా చూసుకుంది. యోగా నిపుణులను రప్పించి నయం చేయించింది. కృష్ణ ఆరోగ్యంగా ఉన్నారంటే అందుకు ఆమె తీసుకున్న శ్రద్ధ కారణమని ఇంట్లో పనివాళ్ళు కూడా చెబుతారు. అయితే ఇంతగా ప్రేమ బంధం ముడివేసుకున్న వీరిద్దరూ కల్సి పిల్లల్ని ఎందుకు కనలేదో అందరికీ ఆశ్చర్యమే. కానీ కొన్నాళ్ల కిందట ఓపెన్ విత్ ఆర్కే కార్యక్రమంలో కొన్ని ఆసక్తికర సంఘటనలను చెప్పుకొచ్చారు.
‘
పెళ్లి ప్రపోజల్ తెచ్చింది కృష్ణ గారే. అయితే అప్పటికే మాకు పిల్లలు ఉన్నారు కదా. అందుకే ఇద్దరికీ కలిపి పిల్లలు వద్దనుకున్నాం’అని విజయ నిర్మల చెప్పారు. అయితే మరో కథనం కూడా ప్రచారంలో ఉంది. అప్పటికే నరేష్ పుట్టడం,మొదటి భర్తతో విజయ నిర్మల విడాకులు తీసుకుని కృష్ణను పెళ్లి చేసుకున్నప్పుడు తన వెంట నరేష్ ని కూడా తెచ్చుకుంది. వీళ్లిద్దరి పెళ్లిని కృష్ణ మొదటి భార్య ఇందిరా,ఇతర ఫ్యామిలీ మెంబర్స్ వ్యతిరేకించారట. ఎందుకంటే అప్పటికే కృష్ణ ద్వారా మొదటి భార్యకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. సినిమా వాళ్ళని పెళ్లి చేసుకుంటే ఇక పిల్లల్ని ఎలా పట్టించుకుంటారని భార్య సైతం కృష్ణను నిలదీశారట.
దీంతో విజయ నిర్మల చొరవ తీసుకుని, ‘మీరు నాకు అక్కలాంటి వారు. మీకు పిల్లలున్నారు. నాకు ఓ కొడుకు ఉన్నాడు. నేను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను. మీ పిల్లలు కూడా నాకు పిల్లలే అందుకే నేను పిల్లల్ని కనను. మీ దగ్గరే కృష్ణ వుంటారు. ఇష్టం వచ్చినప్పుడు నా దగ్గరకు రావచ్చు. ‘అని చెప్పేశారట. కానీ నెలలో చాలా రోజులు షూటింగ్స్ లో గడపడం వలన ఒక్కరోజు కూడా కృష్ణ సెలవు తీసుకునేవారు కాదట. దీనికి తోడు తన నటవారసులు రమేష్,మహేష్ అని కృష్ణ కూడా ముందే ప్రకటించారు. సో మొత్తం మీద పెద్దగా ఇబ్బంది రాలేదు. ఓపక్క నరేష్ బాగోగులు విజయనిర్మల చూసుకుంటే,మరోపక్క మొదటి భార్య పిల్లలపై కృష్ణ శ్రద్ధ పెట్టారు. ఇలాంటి సమయంలో పిల్లల్ని కంటే ఇరువైపులా ఉన్న పిల్లల్ని నిర్లక్ష్యం చేసే ప్రమాదం ఉందని గుర్తించి పిల్లలను కనకూడదన్న నిర్ణయానికి వచ్చారట. అందుకే విజయనిర్మలతో పెళ్లయ్యాక మొదటి భార్యకు మహేష్,అతడి సోదరి పుట్టారు. ఇక మొదటి భార్య సహనం, కృష్ణ విజయ నిర్మల ముందు చూపు కారణంగా అందరూ హాయిగా వున్నారని అంటారు.