Movies

విజయ నిర్మల కోట్ల ఆస్తిని ఎవరికీ రాసిందో తెలుసా?

కొంత కాలంగా అనారోగ్యంతో ఉండి ఆ  తర్వాత తుదిశ్వాస విడిచిన విజయనిర్మల భౌతిక కాయానికి భారీ జనసందోహం మధ్య అంత్యక్రియలు జరిగాయి. హైదరాబాద్ లోని నానక్ గూడా నివాసం నుంచి సాగిన అంతిమ యాత్రలో ఫ్యామిలీ  మెంబర్స్,అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చిలుకూరు దగ్గరలోని విజయ్ కృష్ణ గార్డెన్స్ లో ఆమె భౌతిక కాయానికి ఆమె కొడుకు నరేష్ హిందూ సంప్రదాయం ప్రకారం అంతిమ సంస్కారం చేసారు. ఆసమయంలో కృష్ణను ఓదార్చడం ఎవరివల్లా కాలేదు. 

బుధవారం రాత్రి నుంచి కృష్ణ శోక సందంలోనే ఉన్నారు. ఎందరో బంధువులు , అభిమానులు, ప్రముఖులు వచ్చి పరామర్శించారు. ఎందుకంటే ఒకరితో మరొకరు లేకుండా బయటకు రావడం చాలా రోజులుగా జరగడం లేదు. ఇంట్లో వరండాలో కూడా ఒకరికి మరొకరు తోడు ఉండాల్సిందే. ఇలా ఇంటా బయటా ఒకరికి ఒకరు లేకుండా మరొకరు లేరు. అందుకే కృష్ణ బాధను చూసి ఎవరూ ఓదార్చలేకపోతున్నారు. దీంతో ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించే ప్రమాదం ఉందని భయపడుతున్నారు.

అందరూ కల్సి ఎంతగా ధైర్యం చెబుతున్నా కృష ఆ బాధ నుంచి తేరుకోవడం లేదు. ఈనేపథ్యంలోనే విజయ నిర్మల ఆస్తి విషయం ఆసక్తికరంగా  మారింది. వృద్ధాప్యంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందుగానే ఆలోచించి జాగ్రత్త పడిన ఆమె నానక్ గుడాలో విలువైన వాటిలో పెట్టుబడులు పెట్టారట. ఆమెకు నరేష్ కొడుకు నవీన్ అంటే చాలా ఇష్టమట. ఇద్దరు మనవళ్లు ఉన్నాసరే పెద్ద మనవడు నవీన్ అంటేనే ఆమెకు ఎంతో ఇష్టమట. అందుకే ఆస్తిలో అధిక భాగం నవీన్ కి చెందేలా వీలునామా రాశారట.