Movies

శారద తెలుగు సినిమాలు మానేసి మలయాళంలో నటించటానికి కారణం ఏమిటో తెలుసా?

తెలుగులో వందలాది సినిమాల్లో నటించిన ఒకప్పటి స్టార్ హీరోయిన్ శారద ప్రస్తుతం తెలుగు సినిమా రంగానికి గుడ్ బై కొట్టేసి మళయాళ చిత్రాలకే పరిమితం అయ్యారు. 1945జూన్ 25న గుంటూరు జిల్లా తెనాలి లో వెంకటేశ్వర్లు,సత్యవతి దంపతులకు పుట్టిన శారద చిన్నతనంలోనే డాన్స్ నేర్చుకోవడం మొదలుపెట్టారు. పేరెంట్స్ ఆమెను చెన్నై తీసుకెళ్లి, సినిమాల్లో ఎంకరేజ్ చేశారు. 10ఏళ్ళు నిండకుండానే 1955లో కన్యాశుల్కం మూవీలో చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చి, 1961వరకూ కొనసాగింది. 1975వరకూ హాస్య నటిగా కొనసాగిన ఈమె మలయాళ మూవీస్ లో హీరోయిన్ గా చేస్తూ వచ్చింది.

హీరోయిన్ గా కుటుంబ కథా చిత్రాలు,గంభీరమైన పాత్రలు పోషించింది. మళయాళంలో స్వయంవరం మూవీలో శారద చేసిన నటనకు జాతీయ అవార్డు దక్కింది. ఆతర్వాత హిందీ ,తెలుగులో తీసిన ఈ సినిమాలో కూడా ఆమె నటించింది. మళయాళంలో తులాభారం, తెలుగులో నిమజ్జనం మూవీస్ కి ఊర్వశి అవార్డు లభించింది. మూడు సార్లు కేంద్ర అవార్డులతోపాటు ఎపి,తమిళనాడు,కేరళ ప్రభుత్వాల నుంచి అవార్డులు అందుకున్నారు. 2013సుకుమారుడు మూవీ తర్వాత తెలుగు పరిశ్రమకు దూరమయ్యారు. తనలాంటి సీనియర్స్ తప్పుకుంటేనే జూనియర్స్ కి ఛాన్స్ లు వస్తాయని చెబుతున్న ఆమె,అసలు తెలుగు రంగానికి ఎందుకు దూరమయ్యారో చెప్పడంలేదు. 

నటిగా కెరీర్ లో ఉండగానే అందునా చిన్న వయస్సులోనే 22ఏళ్ళ వయస్సులో చలం అనే నటుడిని పెళ్లాడారు. అప్పటికే అతనికి పెళ్ళై ముగ్గురు పిల్లలున్నారు. అతడి పిల్లల్ని తన పిల్లలుగా భావించి కొత్తగా పిల్లలు వద్దనుకున్నారు. అయితే మనస్పర్థల కారణంగా ఆతర్వాత విడాకులు తీసుకున్నారు. అయితే భార్యాభర్తలు విడిపోవడం తప్పని ఒంటరిగా జీవిస్తున్న ఆమె ఇప్పటికీ చెబుతుంటారు. విడిపోయేవారిని కలిపే ప్రయత్నం చేస్తున్నారు. 

మహిళలకు ఉపాధి కలిపించే దిశగా లోటస్ చాకోలెట్స్ వ్యాపారం ప్రారంభించిన ఈమె కొన్నాళ్ళకు దాన్ని విక్రయించారు. చేనేత కుటుంబానికి శారద 1996లో టిడిపి అభ్యర్థిగా తెనాలి లోక సభకు పోటీచేసి గెలిచారు. అయితే 1998లో వచ్చిన మధ్యంతర ఎన్నికల్లో ఓటమి చెందారు. తర్వాత కాంగ్రెస్ లో చేరి చురుగ్గా పనిచేసి తర్వాత రాజకీయాలను వదిలిపెట్టేసారు. పార్టీలో వర్గ రాజకీయాల వలన బయటకు వచ్చినట్లు చెప్పినా, వారి పేర్లు చెప్పలేదు. అయితే అందులో కొందరు ఇప్పుడు లేరని చెప్పారు. తెలుగులో సీనియర్స్ ని పట్టించుకోవడంలేదన్న మాటను కూడా ఆమె చెప్పకనే చెప్పారు. మలయాళంలో విభిన్న పాత్రలతో రాణిస్తున్నారు.