భర్తలను గుడ్డిగా నమ్మినందుకు జీవిత కాలం శిక్ష పడింది
అది టాలీవుడ్ కావచ్చు,బాలీవుడ్ కావచ్చు ఏ భాషా సినిమా తారలైనా సరే కొందరు తమ జీవితాలను చేజేతులా నాశనం చేసుకున్నారు. అందులో ముఖ్యంగా అందాల తార జయప్రద గురించి చెప్పాలి. చిన్నవయస్సులోనే అందం,అభినయంతో ఆకట్టుకున్న ఈమె దేశంలోని వివిధ భాషల్లో స్టార్ డమ్ తెచ్చుకుంది. పెళ్ళై పిల్లలున్న నిర్మాత శ్రీకాంత్ నహతాను పెళ్లిచేసుకున్న ఈమెకు తర్వాత విషయం అర్ధమైంది. అతడు తనకు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకున్న విషయం దాచి తాళికట్టిన విషయం ఆమె గ్రహించేసరికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇక అతడికి దూరంగా జరిగి రాజకీయాల్లో చేరి,సేవలు అందిస్తోంది. ప్రేమించిన పాపానికి పిల్లలకు దూరమై ఒంటరిగా గడుపుతోంది.
నటి ఊర్వశి విషయానికి వస్తే, 1980లో వెండితెరమీద ఎంట్రీ ఇచ్చి, మలయాళం,కన్నడ,తెలుగు, తమిళం, సినిమాల్లో నటించింది. తెలుగులో చెట్టుకింద ప్లిడర్, సందడే సందడి వంటి చిత్రాల్లో చేసింది. మలయాళ నటుడు మనోజ్ కె జైన్ ని 2000సంవత్సరంలో పెళ్లిచేసుకుంది. భర్తకోసం సరదాగా కొద్దిగా మందు తాగిన ఈమె ఆతర్వాత ముందుకి బానిస అయింది. నిత్యం తాగుతూ ఉండడమే కాక ఎక్కడికెళ్లినా మందుకొట్టి ఏదేదో మాట్లాడ్డం వలన ఆమె జీవితం దెబ్బతింది. ఆమెను తాగుబోతుగా పేర్కొంటూ భర్త విడాకులివ్వగా, కూతురు కూడా తల్లిని వదిలేసి, కోర్టులో కూడా తెగేసి చెప్పి, తండ్రివెంట వెళ్ళిపోయింది. తాగేసి టివి షోలకు వచ్చి గొడవలకు దిగిసే స్థాయికి ఊర్వశి దిగజారిపోయింది. మొత్తానికి జీవితం బాగా చితికిపోవడంతో తాగుడు తగ్గించిన ఈమె ఇటీవల చెన్నైకి చెందిన వ్యాపారవేత్త శివప్రసాద్ ని రెండోపెళ్లి చేసుకుంది.
ఇక ,తెలుగు,తమిళ మళయాళ సినిమాల్లో నటించిన నటి రేవతి కూడా ఇదే తీరు అని చెప్పాలి. 1986లో దర్శకుడు,సినిమాటోగ్రాఫర్ సురేష్ చంద్ర మీనన్ ని పెళ్లిచేసుకున్న ఈమెకు పిల్లలు పుడితే, సినిమాల్లో నటించడానికి ఇబ్బంది అని భర్త చెప్పడంతో ఇక ఫుల్లుగా సినిమాలపైనే దృష్టి పెట్టేసింది. ఇక ఇద్దరి మధ్యా దూరం పెరగడం,రేవతి కి పిల్లలు పుట్టడం లేదంటూ భర్త విడాకులకు వెళ్ళాడు. ఖంగు తిన్న రేవతి మాటమార్చిన వాడితో ఉండడం కూడా అనవసరమని 2011లో విడాకులు ఇచ్చేసింది. జీవితంలో దెబ్బతిన్న ఆమె ఇటీవల ఓపాపను దత్తత తీసుకుని, గతకాలపు చేదు జ్ఞాపకాలను మర్చిపోయే ప్రయత్నం చేస్తోంది.