Movies

అమ్మతనానికి దూరంగా ఉన్న గొప్ప మనస్సు ఉన్న హీరోయిన్స్

చాలామంది మాతృత్వం కోసం తపిస్తారు. కానీ కొందరు సమాజ శ్రేయస్సు,వృత్తికి అంకితం అవ్వడం వలన మాతృత్వానికి దూరంగా ఉండిపోయే అమ్మ మనసున్న అమ్మకాని అమ్మలు మన సినీ ఇండస్ట్రీలో కొందరు ఉన్నారు. అందులో ముందుగా నటి శారదను ప్రస్తావించాలి. చిన్నతనంలోనే చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. డాన్సర్ కావడం,అందమైం ముఖ వర్చసు ఉండడంతో ఆమెను సినిమాల్లోకి ఈజీగా తీసుకున్నారు. తెలుగు,తమిళ,మలయాళ భాషల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమె సినిమాల్లో పీక్ స్టేజ్ లో ఉండగానే 22 ఏళ్ళ వయస్సులో నటుడు చలం ను పెళ్లిచేసుకుంది. అంతకుముందే పెళ్లై ముగ్గురు పిల్లలున్న చలం భార్య చనిపోవడంతో శారదను పెళ్లిచేసుకున్నాడు. చలం పిల్లలే తన పిల్లలనుకుని నటనపై పూర్తి దృష్టి పెట్టింది. ఇలా నటించడం చలానికి నచ్చలేదు. దీంతో వీళ్ళ మధ్య గొడవలు మొదలై, విడాకులు తీసుకున్నారు. పెళ్లి ,పిల్లలు వద్దనుకుని ఒంటరిగా మిగిలిపోయింది. 

లేడి అమితాబ్ విజయశాంతి చైల్డ్ ఆర్టిస్టుగా సినిమాల్లోకి అడుగుపెట్టి, గ్లామర్ పాత్రలతో తెలుగు, తమిళ ,కన్నడ భాషల్లో అగ్ర హీరోల సరసన నటించి మెప్పించింది. వరంగల్ జిల్లాకు చెందినవారు. వరంగల్ జిల్లాకు చెందిన ఈమె లేడీ ఓరియెంటెడ్ పాత్రలతో సత్తా చాటింది. కొందరు హీరోలతో సన్నిహితంగా ఉందని, వాళ్ళని పెళ్లి చేసుకునే ఆలోచనలో ఉందని ఇలా రకరకాల రూమర్స్ వచ్చాయి. ఈ రూమర్స్ ని లెక్కచేయకుండా నటిస్తున్న సమయంలోనే శ్రీనివాస ప్రసాద్ ని పెళ్ళాడి ఆయన్ని నటనకు దూరంగా ఉంచింది. నటిస్తున్న సమయంలో పిల్లల గురించి ఆలోచన చేయలేదు. రాజకీయాల్లోకి చేరిన ఈమె సమాజంలో ఉన్నవాళ్ళంతా తమ పిల్లలేనని,ఇంతమంది పిల్లలు ఉండడం కన్నా అమ్మదనం ఏముంటుందని పలుసార్లు ఇంటర్యూలో ఎదురు ప్రశ్నలతో సమాధానం ఇచ్చింది. అమ్మ అనే పదం మర్చిపోయి సమాజ సేవకోసం,రాజకీయాలకు అంకితం అయింది.

మరో స్టార్ హీరోయిన్ జయప్రద దేశవ్యాప్తంగా హీరోయిన్ గా రాణించి,ఎన్నో అవార్డులు,రివార్డులు సొంతం చేసుకుంది. పెళ్ళై పిల్లలున్న ప్రొడ్యూసర్,ఫైనాషియర్ శ్రీకాంత్ నహతా ను పెళ్లిచేసుకుంది. భర్తకు పిల్లలు ఉండడంతో తనకు పిల్లలు వద్దనుకుంది. ఇక ఆతరవాత మనస్పర్ధలతో విడిపోయి, రాజకీయాల్లోకి వచ్చి,ప్రజాసేవకు అంకితం అయింది. అలాగే దాదాపు 1400మూవీస్ లో నటించిన రమాప్రభ తనకన్నా చిన్నవాడైన శరత్ బాబుని పెళ్ళాడి, 14ఏళ్ళ తర్వాత మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకుంది. అతడితో గొడవ కారణంగా దాంపత్య జీవితం అంటేనే ఆమెకు విరక్తి కల్గింది. పిల్లలు లేరు,మళ్ళీ పెళ్ళీ లేదు. అయితే హుషారుగా ఇప్పటికీ ఒంటరిగానే జీవితం సాగిస్తోంది.

ఇక నటి రేవతి కూడా మాతృత్వం వద్దనుకుంది. ప్లస్ టు నుంచే నాటకాల్లో వేయడం మొదలు పెట్టిన ఈమె సినీ రంగంలో అడుగుపెట్టి తెలుగు,తమిళ , హిందీ చిత్రాల్లో నటించి ఎన్నో అవార్డులు గెలుచుకుంది. ఈమె 1986లో సినిమాటోగ్రాఫర్, డైరెక్టర్ అయిన సురేష్ చంద్ర మీనన్ సినిమాలపైనే దృష్టి పెట్టి పిల్లలు వద్దనుకుంది. ఇక ఇద్దరి మధ్యా దూరం పెరగడం,రేవతి కి పిల్లలు పుట్టడం లేదంటూ భర్త విడాకులకు వెళ్ళాడు. మనస్పర్ధలతో భర్తతో 2011లో విడాకులు ఇచ్చేసి, కంటేనే అమ్మ అంటే ఎలా అంటూ ఇటీవల ఓపాపను దత్తత తీసుకుని, అమ్మా అని పిలిపించుకుని మురిసిపోతోంది.