కార్తీక్ రియల్ ఏజ్ ఎంతో తెలిస్తే నిజంగా షాక్ అవుతారు
తెలుగు సినీ రంగంలోనే కాదు బుల్లి తెరమీద కూడా ఇతర భాషల నటీనటుల హవా నడుస్తోంది. ఇలాంటి సమయంలో మనవాళ్ళు పోటీకి నిలబడి తట్టుకోవడం కష్టమే అయినా, కొందరు నిలదొక్కుకుంటున్నారు. అందులో ముఖ్యంగా కార్తీక దీపం సీరియల్ హీరో కార్తీక్ ఒకడు. విజయవాడకు చెందిన ఇతడి అసలు పేరు నిరుపమ్ పరిటాల. చెన్నైలో ఇంజనీరింగ్ చదివిన కార్తీక్ ఎవరంటే ప్రముఖ రచయిత, నటుడు ఓంకార్ పరిటాల కుమారుడే.
నటన మీద ఆసక్తితో మద్రాస్ నుంచి హైదరాబాద్ కి వచ్చేసిన కార్తీక్, మొత్తానికి ఈవీవీ ద్వారా బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చి, తన తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని తక్కువ కాలంలోనే తన నటనతో అశేష ప్రేక్షకాదరణ సొంతం చేసుకున్నాడు. కాంచన గంగ, మూగమనసులు,చంద్రముఖి,కలవారి కోడలు వంటి సీరియల్స్ లో తన సత్తా చాటాడు. ప్రస్తుతం జీటీవీలో ప్రసారం అవుతున్న ప్రేమ సీరియల్,స్టార్ మాలో ప్రసారం అవుతున్న కుంకుమ పువ్వు ,అలాగే కార్తీక దీపం సీరియల్స్ తో బిజీ అయ్యాడు.
ప్రతి సీరియల్ లో లీడ్ రోల్ చేయడం నిరుపమ్ కే చెల్లింది. ఫిబ్రవరి 15న పుట్టిన ఇతడి వయస్సు 33ఏళ్ళు మాత్రమే. ఇక ఎన్నో స్వచ్ఛంద సంస్థలకు తనవంతు సాయం అందిస్తున్న నిరుపమ్,తన నటనా ప్రస్థానం విజయవంతంగా సాగిస్తున్నాడు. ఇక చంద్రముఖి సీరియల్ నటిస్తున్నప్పుడు సీరియల్ నటి మంజుల తో నిరుపమ్ ప్రేమలో పడ్డాడు. మంజుల ఎవరంటే,స్టార్ మాలో ప్రసారమవుతున్న కృష్ణవేణి సీరియల్ లో ప్రభ పాత్రలో నటిస్తున్నది ఈమె. ఇక ఇద్దరూ ప్రేమించి పెళ్లిచేసుకున్నారు.