రాజశేఖర్ మిస్ చేసుకున్న సినిమాలు ఏమిటో తెలుసా… అవి చేసి ఉంటే….???
కొంతకాలం వరుస పరాజయాలను చవిచూసిన హీరో డాక్టర్ రాజశేఖర్ గతంలో వరుస హిట్స్ తో ఇండస్ట్రీలో దుమ్ముదులిపాడు. యాంగ్రీ హీరోగా, కుటుంబ కథా చిత్రాల హీరోగా ముద్రపడిన డాక్టర్ రాజశేఖర్ ఇటీవల గరుడ వేగ మూవీతో మళ్ళీ హిట్ కొట్టాడు. అయితే తాజాగా వచ్చిన కల్కి మూవీ టాక్ బాగానే వచ్చినప్పటికీ వసూళ్లను రాబట్టలేకపోతోంది. అయితే విలన్ పాత్రలకు సైతం సిద్ధమని గతంలో డాక్టర్ రాజశేఖర్ ప్రకటించాడు. కానీ తమిళ్ లో సూపర్ హిట్ సాధించిన సినిమా ఆధారంగా రామ్ చరణ్ నటించిన దృవ సినిమాలో అరవింద్ స్వామి చేసిన పాత్రను చేయాల్సి ఉంది.
తెలుగులో రీమేక్ చేసేటప్పుడు అరవింద్ స్వామి క్యారెక్టర్ ని ఎవరు చేస్తే బాగుంటుందన్న టాక్ వచ్చింది. డాక్టర్ రాజశేఖర్ పేరు తెరమీదికి రావడం ,ఒప్పుకోడానికి సిద్ధపడడం,అన్నీ జరిగినా చివరకు అరవింద్ స్వామినే ఆ పాత్ర వరించింది. తమిళంలో అరవింద్ సింగిల్ గా ఉన్నప్పుడు చేసిన సన్నివేశాలను యధాతధంగా తెలుగులో వాడుకోవడం వలన, దీనివలన నిర్మాణ వ్యయం కూడా తగ్గుతుందని భావించడం వలన ఈ నిర్ణయం తీసుకున్నారట.
ఇదిలా ఉంచితే గతంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన స్నేహం కోసం మూవీలో చిరు స్నేహితుడి వేషం వేయడానికి రాజశేఖర్ ముందుకొచ్చినప్పటికీ , ఇంకా యంగ్ గా ఉన్నందున ఈ పాత్రకు సరిపోరని,మరోసినిమా చేద్దామని చిరు అన్నారట. అలా ఆ ఛాన్స్ మిస్సయింది. పోనీ అల్లు అర్జున్ చేసిన సన్నాఫ్ సత్యమూర్తిలో చేద్దామంటే అదీ రాలేదు. ఇందులో ఉపేంద్ర పాత్రకు రాజశేఖర్ పేరుకూడా మొదట్లో ప్రతిపాదనలోకి వచ్చిందట. అంతేకాదు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీలో ప్రకాష్ రాజ్ పాత్రను డాక్టర్ రాజశేఖర్ చేయాల్సి ఉందట. అయితే ఆ పాత్ర గురించి పూర్తిగా చెప్పకపోవడం వలన ఒకే చేయలేకపోయానని డాక్టర్ రాజశేఖర్ గతంలోనే చెప్పుకొచ్చాడు.