Movies

ఆ యాంకర్స్ లేకుంటే ఈవెంట్లు గోవిందా… ఎందుకో తెలుసా?

ఒకప్పుడు బుల్లితెర షోస్ కి పరిమితమైన యాంకర్ల వ్యవస్ధ రానురాను సినిమా ఫంక్షన్స్ లో కీలకంగా మారారు. ముఖ్యంగా ఇప్పుడు సినిమా ప్రమోషన్లలో చాలా కీలకంగా మారుతున్న ప్రీ రిలీజ్ ఈవెంట్లు సక్సెస్ కావడంలో యాంకర్లు పోషిస్తున్న పాత్ర కూడా ఎక్కువే అని చెప్పాలి. చిన్న హీరో అయినా పెద్ద స్టార్ అయినా వేడుకకు నిండుతనం తెచ్చి మాటలతో కోటలు కడతారు. వేడుకకు వచ్చిన వాళ్లకు యాంకర్లు కిక్ ఇవ్వడంతో వీళ్ళ పాత్ర కీలకంగా మారింది. అందుకే సుమ వన్ అండ్ ఓన్లీ యాంకర్ గా ఇప్పటికీ అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆ తర్వాత యాంకర్ శ్యామల-ఝాన్సీ లాంటి వాళ్ళు ఉన్నప్పటికీ సుమ కు ఎవరూ పోటీ ఇచ్చే స్థితి అంటూ లేదు. 

అయితే వచ్చిన చిక్కల్లా ఏమిటంటే సుమ ఇప్పుడు తానా సభల కోసం అమెరికా వెళ్ళింది. మరి ఇక్కడ చూస్తే వరసబెట్టి ఈవెంట్లు నడుస్తున్నాయి. ఆయా హీరో హీరోయిన్ల రేంజ్ కు తగ్గట్టు అన్ని పెద్ద బడ్జెట్లే. కానీ సుమ అందుబాటులో లేకపోవడం ఆ లోటు కొట్టొచ్చినట్టు కనిపిస్తోందని కామెంట్స్ వస్తున్నాయి. ఈ కారణంగా ఒకప్పుడు ఓ వెలుగు వెలిగి తర్వాత ఫామ్ కోల్పోయి కుటుంబానికి పరిమితమైన ఓ సీనియర్ లేడీ యాంకర్ తో ఇటీవలే ఓ ఈవెంట్ చేయడం అంతగా ఫలితాన్ని ఇవ్వలేదు. నలభై పడి దాటిన మరో యాంకర్ తో ఇంకో ఈవెంట్ చేసినా,ఆకట్టుకోలేదట. 

సినిమా ఈవెంట్లు అంటే, ఫాన్స్ ని మాటలతో కంట్రోల్ చేయడం వేదిక మీద అతిధులను పిలిచే క్రమంలో జాగ్రత్తలు వహించడం ఇవన్నీ టైమింగ్ ఉన్న వాళ్ళు చేసే పనులు. కానీ అది ఈ ఇద్దరి వల్ల కాకపోవడంతో రెస్పాన్స్ కూడా అంతంత మాత్రంగానే వచ్చింది. శ్యామల బెటర్ అనుకుంటే తాను కూడా తానాలోనే ఉంది. ఒక ఇద్దరు యాంకర్లు లేకపోతే కోట్ల రూపాయల పెట్టుబడులతో సాగుతున్న టాలీవుడ్ ఈవెంట్లు ఎలా నెగ్గుకు రావాలో తెలియడం లేదని ప్రొడ్యూసర్స్ , చిత్ర బృందాలు ఆశ్చర్యపోతున్నాయి.