టాలీవుడ్ టాప్ 10 మూవీస్ కలెక్షన్స్ ఇవే…. నెంబర్ 1 హీరో ఎవరు?
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలు ప్రజలను ఆకట్టుకున్నాయి. కలెక్షన్స్ వర్షం కురిపించాయి . ఎంతోమంది హీరో హీరోయిన్స్ కి పేరు తెచ్చాయి. ఒకప్పుడు వందకోట్ల కలెక్షన్స్ అంటే సాధ్యమా అన్నట్లు ఉంటె ఇప్పుడు అది సాధ్యం అవుతోంది. అందుకే వందల కోట్లు వెచ్చించి సినిమాలు తీసేస్తున్నారు. సక్సెస్ లు కొడుతున్నారు. ఇందులో ముఖ్యంగా ఓ పది సినిమాల కలెక్షన్స్ టాప్ కలెక్షన్స్ పరిశీలిస్తే,మొదటగా ఎస్ ఎస్ రాజమౌళి తీసిన బాహుబలి సినిమాని చెప్పుకోవాలి. రెండు భాగాలుగా రూపుదిద్దుకున్న బాహుబలి ఒకదాన్ని మించి మరొకటి భారీ విజయాల్ని నమోదు చేసి,ఇండస్ట్రీ రికార్డులను తుడిచిపెట్టేశాయి. ఇప్పటికింకా ఈ రికార్డులు అలానే ఉన్నాయి. బాహుబలి కంక్లూజన్ మూవీ వరల్డ్ వైడ్ గా 1807కోట్లకు పైగా వసూలు చేసింది. ఇక బాహుబలి బిగినింగ్ 602కోట్లు రాబట్టి రెండో స్థానంలో నిలిచింది.
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన రంగస్థలం బాక్సాఫీస్ దగ్గర బంపర్ హిట్ అందుకుంది. విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ మూవీ వరల్డ్ వైడ్ గా 215. 7కోట్లు వసూలు చేసి మూడవ స్థానంలో నిలిచింది. ఆతర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను వరల్డ్ వైడ్ గా 185. 6కోట్లు రాబట్టి, నాల్గవ ప్లేస్ లో నిల్చింది. అలాగే మహేష్ నటించిన మహర్షి మూవీ రైతు జీవితాల ఆధారంగా తెరకెక్కి మంచి కలెక్షన్స్ రాబట్టింది. మహేష్ 25వ మూవీగా వచ్చిన ఈ సినిమా 184. 6కోట్లు వసూలు చేసి, ఐదవ స్థానంలో నిల్చింది.
ఇక రాజకీయాల నుంచి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్ 150మూవీ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుని , రికార్డ్ విజయాన్ని అందుకుంది. వరల్డ్ వైడ్ గా 165కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసి,ఆరవ స్థానాన్ని సాధించింది. గ్రామాలను దత్తత తీసుకోవాలనే కాన్సప్ట్ తో వచ్చిన శ్రీమంతుడు మూవీలో మహేష్ నటనకు జనం బ్రహ్మరధం పట్టారు. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 156కోట్లు వసూలు చేసి,7వ స్థానంలో నిల్చింది. ఇక ఎనిమిదవ స్థానంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత వీర రాఘవ మూవీ నిల్చింది. ఈ మూవీ వరల్డ్ వైడ్ గా 155కోట్లు కలెక్ట్ చేసింది. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చిన ఎఫ్ 2మూవీ కలెక్షన్స్ దుమ్మురేపింది. 140. 5కోట్లు వరల్డ్ వైడ్ గా వసూలు చేసి, 9వ ప్లేస్ లో నిల్చింది. ఇక జూనియర్ ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారేజ్ వరల్డ్ వైడ్ గా వరల్డ్ వైడ్ గా 136కోట్ల రూపాయల కలెక్షన్స్ సాధించి, 10వ స్థానంలో నిల్చింది.