ఎన్టీఆర్ శక్తి సినిమాలో నటించిన ఈ నటి ఎవరి కూతురో తెలుసా?
లేడీ విలన్లు ఇండస్ట్రీలో బాగానే పాపులర్ అయ్యారు. బాలీవుడ్ లో 1990లోనే సెక్స్ బాంబ్ గా పేరుతెచ్చుకున్న నటి పూజా బేడీ తెలుగులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన శక్తి మూవీలో విలన్ గా నటించి ఆడియన్స్ ని ఆకట్టుకుంది. బాలివుడ్ నటుడు కబీర్ బేడీ , క్లాసికల్ డాన్సర్ ప్రతిమా బేడీల కూతురైన పూజా బేడీ 1970మే11న ముంబయిలో పుట్టింది. మోడలింగ్ ,యాక్టింగ్ లో సెన్షేషన్ క్రియేట్ చేసింది. ఇప్పుడంటే, బికినీలు ధరించడానికి చాలామంది ముందుకొస్తున్నా, అప్పట్లో అలా చేయడానికి సంకోచించేవారు.
అలాంటి కీలక దశలో ఏకంగా కామసూత్ర కండోమ్ బ్రాండ్ అంబాసిడర్ గా పూజా బేడీ పై అప్పట్లో విమర్శల జడివాన వచ్చింది. అయితే వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా పూజా తన దారిలో తాను వెళ్ళింది. 1991లో విష కన్య సినిమాతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈమె హీరోయిన్ గా రాణించలేదు. కేవలం సపోర్టింగ్ యాక్ట్రెస్ గా బాగా రాణించింది. ఇక తెలుగులో మోహన్ బాబు పక్కన చిట్టెమ్మ మొగుడు సినిమాలో ఓ పాత్ర చేసింది. ఇక 2005నుంచి మ్యాచ్ బాలియా వంటి రియాల్టీ షోస్ చేస్తూ పేరు సంపాదిస్తోంది. బిగ్ బాస్ లో పోటీ పడినప్పటికీ విజయం వరించలేదు. ఫెమినా,డమిక్ వంటి వార పక్ష పత్రికల్లో కాలమిస్ట్ గా పనిచేసింది. వ్యాపార వేత్త పరాన్ ఇబ్రహీం ని 1990లో పెళ్లిచేసుకుంది.
1997లో అలియా ఇబ్రహీం అనే కూతురు,2000లో ఒమర్ ఇబ్రహీం అనే కుమారుడు పుట్టారు. అయితే 2003లో పరాన్ కి విడాకులిచ్చిన పూజా,ఇప్పుడు లేటు వయస్సులో తన బాయ్ ఫ్రెండ్ మాణిక్ కాంట్రాక్టర్ ని పెళ్లి చేసుకోడానికి నిశ్చితార్ధం చేసుకుంది. 49ఏళ్ళ వయస్సులో 100అడుగుల ఎత్తులో బెలూన్ లో తీసుకెళ్లి ప్రపోజ్ చేసాడట. చిన్నప్పటినుంచి ఫ్రెండ్స్ కావడంతో ఈ మధ్య గోవా బిజినెస్ పనిమీద వెళ్ళినపుడు ఇద్దరూ లవ్ చేసుకున్నారు. ఇక కుమార్తె అలియా సినీ రంగం లోకి అడుగుపెట్టి , ఓ హిందీ సినిమాలో నటిస్తోంది. తల్లితో సమానంగా బికినీలు వేసుకుని ఫోటోలకు ఫోజులిస్తూ అలియా ఇప్పటికే చాలామంది ఫాన్స్ ని సంపాదించుకుంది. కాగా కూతురు సినిమాల్లో బిజీగా లేనప్పుడు పెళ్లి చేసుకోవాలని పూజా, మాణిక్ నిర్ణయించుకున్నారు.