అల్లు అర్జున్ క్యారవాన్ డ్రైవర్ జీతం ఎంతో తెలుసా?
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ స్పెషల్ గా ఓ క్యారవాన్ తయారు చేయించుకుని, డ్రైవర్ లక్ష్మణ్ కి కూడా స్పెషల్ గా ట్రైనింగ్ కూడా ఇప్పించాడు. ఇంద్ర భవనాన్ని తలపించే క్యారవాన్ ని రథసారధిగా గల లక్ష్మణ్ మాట్లాడుతూ మొదట్లో బోయపాటి దగ్గర చేశానని,సరైనోడు సినిమా సమయంలో బన్నీ దగ్గర చేరానని వివరించాడు. అంత్యంత కాస్ట్లీ వెహికల్ కనుక అన్నీ పరిశీలించి తర్ఫీదు పొంది డ్రైవ్ చేస్తున్నానని చెప్పాడు. పూణేలో ఈ క్యారవాన్ తయారైందని,అక్కడే తాను15,20రోజులు శిక్షణ పొందానని చెప్పాడు.
శిక్షణ కాలంలో అయిన ఖర్చంతా బన్నీ పెట్టుకున్నారని,శిక్షణ పూర్తయ్యాక క్యారవాన్ స్వాధీనం చేసేముందు బన్నీ కూడా అక్కడికొచ్చి అన్నీ పరిశీలించారని డ్రైవర్ లక్ష్మణ్ చెప్పాడు. తాను కూడా బన్నీ ఫ్యాన్ అని చెప్పాడు. మొదటి నుంచి మెగా ఫామిలీ అభిమాని కావడం,ఇప్పుడు బన్నీ దగ్గర చేరి , డ్యూటీ చేయడం హ్యాపీ గా ఉందంటున్నాడు. మా ఊరు వాళ్ళు కూడా నేను ఇలా పనిచేయడం పట్ల ఆనందంగా ఉన్నారని చెప్పాడు.
‘క్యారవాన్ సరిగ్గా వాల్వ్ బస్సులా ఉంటుంది. టైర్లు,మిర్రర్స్ అన్నీ బన్నీ దగ్గరుండి డిజైన్ చేయించుకున్నారు. పుష్షింగ్ ఎక్కువ. హైట్, వెయిట్ తక్కువ గా ఉంటాయి. సెట్ లో ఎక్కడ షూటింగ్ ఉన్నా సరే అక్కడికి వెళ్తుంది. భారత్ బెంజి మోడల్ కనుక అద్దాలతో ఉంటుంది. ఎలా పడితే అలా నడపకూడదు. ఇండియాలో ఎక్కడ షూటింగ్ జరిగినా వెళ్తాం కాబట్టి,80కిమీ స్పీడ్ లాక్ పెట్టించారు’అని డ్రైవర్ లక్ష్మణ్ వివరించాడు. ఇక క్యారవాన్ లో ఎప్పుడూ రెండు మూడు మొక్కలు రెడీగా ఉంటాయి. షూటింగ్ లో ఎవరికైనా పుట్టినరోజు అయితే కేక్ కట్ చేయించి,మొక్క గిఫ్ట్ గా ఇవ్వడం బన్నీ అలవాటని , అలాగే ఫాన్స్ ని కూడా మొక్కలే గిఫ్ట్ గా తీసుకురమ్మని చెబుతారని లక్ష్మణ్ చెప్పుకొచ్చాడు.