ఈ ఏడాది ఫామ్ లోకి వచ్చిన ఫ్లాప్ దర్శకులు వీళ్లే
కొన్నేళ్లుగా వరస ఫ్లాపుల్లో ఉండి 2019లో హిట్ కొట్టారు ఆ దర్శకులు. వాళ్ల సినిమాలు వచ్చినట్లు కూడా ప్రేక్షకులు పట్టించుకోవడం మానేసిన తరుణంలో హిట్ కొట్టి తాము ఇంకా రేసులో ఉన్నామని నిరూపించారు.మరి ఫ్లాపుల్లోంచి హిట్స్ లోకి వచ్చిన ఆ దర్శకులు ఎవరో చూద్దాం.
- పూరి జగన్నాథ్ – టెంపర్ తర్వాత పూరి జగన్నాథ్ ఇస్మార్ట్ శంకర్ తో దిమ్మతిరిగిపోయే హిట్ కొట్టాడు.
- నందిని రెడ్డి – అలా మొదలైంది తర్వాత నందిని రెడ్డి ఓ బేబీ తో హిట్ కొట్టింది
- రామ్ గోపాల వర్మ – లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాతో వర్మ చాలా రోజుల తర్వాత ఫామ్ లోకి వచ్చాడు.
- కిషోర్ తిరుమల – చిత్రలహరి సినిమాతో మరోసారి ఫామ్ లోకి వచ్చాడు ఈ దర్శకుడు. సాయి ధరమ్ తేజ్ కు ఆరు ఫ్లాపుల తర్వాత వచ్చిన సినిమా ఇది.