Movies

కార్తీక దీపం సీరియల్ నిరుపమ్(కార్తీక్) సంపాదన ఎంతో తెలుసా?

కార్తీకదీపం సీరియల్ హీరో కార్తీక్ అలియాస్ నిరుపమ్ పరిటాల ఆడియన్స్ లో గుర్తింపు వీరలెవెల్లో దూసుకెళ్తోంది. ఈ పాత్రతో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్నాడు. బుల్లితెరపై తెలుగు వాళ్ళు దాదాపు కనిపించని పరిస్థితి ఏర్పడితే, నిరుపమ్ పరిటాల మాత్రం అగ్ర హీరోగా రాణిస్తున్నాడు. స్వస్థలం విజయవాడ అయినా, చెన్నైలో ఇంజనీరింగ్ చేసిన నిరుపమ్ పరిటాల నటనపై ఆసక్తితో హైదరాబాద్ వచ్చాడు. ఈటివి ద్వారా తెలుగు ఆడియన్స్ కి పరిచయం అయిన నిరుపమ్ తర్వాత పలు సీరియల్స్ లో చేసాడు. 

కాంచనగంగ, మూగ మనసులు,చంద్రముఖి,కలవారి కోడలు వంటి సీరియల్స్ లో నటించిన నిరుపమ్ పరిటాల సెలబ్రిటీగా మారాడు. ఇక సెలబ్రిటీల సంపాదన,రెమ్యునరేషన్ గురించి కూడా సహజంగా అందరికీ ఆసక్తి ఏర్పడుతుంది. ఎందుకంటే సినీ తారలకు ఏమాత్రం తీసిపోని రీతిలో వీళ్ళ సంపాదన ఉంది. అందుకే నిరుపమ్ సంపాదనపై కూడా ఆడియన్స్ లో ఆసక్తి పెరగడం,ఆపై కూపీ లాగడం సోషల్ మీడియా వంతైంది. దీంతో ఓ ఆసక్తికర కథనం వెలుగుచూసింది. ఇతడి నటనకు రోజుకి 30నుంచి 40వెలవరకూ ఉన్నట్లు తెలుస్తోంది. 

ప్రస్తుతం జీతెలుగులో ప్రేమ సీరియల్,స్టార్ మాలో ప్రసారమయ్యే కుంకుమ పువ్వు,కార్తీక దీపం సీరియల్స్ చేస్తూ యమబిజీగా ఉన్న నిరుపమ్ పరిటాల అన్ని సీరియల్స్ లో లీడ్ రోల్స్ వేయడం విశేషం. కథలో ఎమోషన్, దమ్మున్న పాత్ర అయి ఉంటేనే చేస్తున్నాడు. దీన్ని బట్టి రోజుకి రెండు మూడు షూటింగ్స్ లో పాల్గొంటాడు. ఈవిధంగా రోజుకి కనీసం 50వేలు పైనే సంపాదిస్తున్నట్టు చెప్పవచ్చు. నెలకు 25షూటింగ్స్ చేయాల్సి ఉంటుంది. దీనిప్రకారం నెలకు 10నుంచి 12లక్షల ఆదాయం గడిస్తున్నాడని టాక్. ఎన్నో స్వచ్ఛంద సంస్థలకు,ఆశ్రమాలకు సాయం అందిస్తూ మంచి వ్యక్తిత్వం గల మనిషిలా నడుచుకుంటున్నాడు.