చేయని తప్పుకు కూతుళ్లను వదులుకోవలసి వచ్చిన హీరోయిన్స్ పాపం
మన సినిమా ఇండస్ట్రీలో ఎన్నో చిత్ర విచిత్రాలు చోటుచేసుకుంటాయి. ప్రేమలు,పెళ్లిళ్లు,విడాకులు,మళ్ళీ పెళ్ళీ ఇవన్నీ క్వాజువల్ గా జరిగిపోయే సంఘటనలు. అయితే పెళ్లయి పిల్లలు పుట్టాక విడిపోయినప్పుడు పిల్లలు ఎవరి దగ్గర ఉండాలనే ప్రశ్న వస్తుంది. అప్పుడు తల్లికి దూరం కావాల్సి వస్తే,పిల్లల్ని వదులుకోవాల్సి వస్తే ఆ బాధ వర్ణించలేం. అలాంటి సంఘటనలు కూడా ఇండస్ట్రీలో ఉన్నాయి. విధి చేతిలో మోసపోయి తల్లీకూతుళ్లు విడిపోయిన గతంలో మొదటగా సారిక గురించి ప్రస్తావించాలి.
కమల్ హాసన్,సారిక ప్రేమించి పెళ్ళిచేసుకుని సంసారం చేసాక ఇద్దరు పిల్లలు పుట్టారు. నిజానికి సారిక కమల్ కి రెండో భార్య. సారిక బాలనటిగా ఉండగా తల్లి చేతిలో దారుణ హింసకు గురైంది. హీరోయిన్ అయ్యాక తల్లిని ఎదిరించి, బయటకొచ్చి కమల్ తో ప్రేమలో పడింది. పెళ్ళికి ముందే కమల్ తో గర్భవతిగా మారిన సారిక ఎలాగోలా ఒప్పించి పెళ్లాడింది. పిల్లలు పుట్టాక కమల్ తీరు నచ్చకపోవడంతో విడాకులు తీసేసుకుంది. అయితే కూతుళ్లు శృతి హాసన్,అక్షర హాసన్ లు తండ్రితోనే ఉండిపోవడంతో సారిక ఒంటరిగా ఎక్కడో జీవితం వెళ్లదీస్తోంది.
అయితే తల్లి గురించి కూతుళ్ళకు గుర్తులేదు. ఇక కమల్ మళ్ళీ మళ్ళీ ప్రేమలో పడుతూ పెళ్లిళ్లు చేసుకుంటున్నా, సారిక మాత్రం పెళ్ళికి దూరంగా ఉంటోంది. కూతుళ్లు హీరోయిన్స్ గా స్థిరపడినా తల్లి ఊసే లేదు . ఆవిధంగా వీళ్ళు తల్లిని వదిలించుకున్నారని చెప్పవచ్చు. అలాగే హీరోయిన్ ఊర్వశి తన సహ నటుడు మనోజ్ ని ప్రేమించి కూతురు పుట్టాక విపరీతంగా తాగుడుకు బానిసై జీవితం నాశనం చేసుకుంది. భర్త విడాకులివ్వగా, తల్లి తనకు వద్దు అని కూతురు కూడా కోర్టుకెక్కింది. తల్లికి దూరంగా ఉండిపోయింది.
ఊర్వశి మళ్ళీ పెళ్ళిచేసుకుని కూతురి పాలిట విలన్ గా మిగిలింది. ఇక హీరోయిన్ సీత,పార్థి బన్ ల మధ్య పెళ్లి సవ్యంగా సాగినా,ఇద్దరు కూతుళ్లు పుట్టాక తేడా వచ్చింది. ఏమైందో ఏమో గానీ పిల్లలు చిన్నవయసులో ఉండగానే విడాకులు తీసుకున్నారు. అయితే పిల్లలను సీతకు ఇవ్వడానికి పార్థి బన్ ఒప్పుకోలేదు. సీత కూడా వాళ్ళను దగ్గర పెట్టుకోదని ఇష్టపడలేదు. ఇక పార్థి బన్ కూడా కూతుళ్ళ కోసం మళ్ళీ పెళ్లిచేసుకోలేదు. అయితే సీత మాత్రం సతీష్ అనే నటుడిని పెళ్ళాడి,కొంతకాలానికి అతడికి విడాకులిచ్చి ప్రస్తుతం ఒంటరిగానే ఉంటోంది. ఇటీవల కూతుళ్ళకు పెళ్లిళ్లు కూడా అయ్యాయి.