Kargil Vijay Divas

కార్గిల్ యుద్ధం అక్కడే జరగటానికి కారణం ఏమిటో తెలుసా?

భారత్-పాకిస్తాన్ విభజన జరగక ముందు కార్గిల్ ప్రాంతం లద్దాక్ ప్రాంతం లోని బల్టిస్తాన్ జిల్లాలో భాగంగా ఉండేది. మొదిటి కాశ్మీర్ యుద్ధం (1947–48) తర్వాత నియంత్రణ రేఖ బల్టిస్తాన్ జిల్లాగుండా ఏర్పడింది. దీంతో కార్గిల్ ప్రాంతం భారతదేశంలోని జమ్మూ-కాశ్మీర్ లో భాగమైంది. 1971లో యుద్ధంలో పాకిస్తాన్ ఓడిపోయిన తర్వాత ఇరు దేశాలు సిమ్లా ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఆ ఒప్పందం ప్రకారం ఈ సరిహద్దుని అంగీకరించడంతో పాటు ఇక్కడ ఎటువంటి కాల్పులకు దిగకూడదు.

కార్గిల్ ప్రాంతం శ్రీనగర్ నుంచి 205 కి.మీ. ల దూరంలో ఉంది.హిమాలయాల్లోని మిగతా ప్రాంతాల లాగా కార్గిల్ ప్రాంతంలో కూడా వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. శీతాకాలంలో ఉష్ణోగ్రత −48 °C గా ఉంటుంది శ్రీనగర్ – లేహ్ లను కలిపే జాతీయ రహదారి (NH 1D) కార్గిల్ గుండా వెళుతుంది. ఈ ప్రాంతం లోకి పాకిస్తాన్ చొరబాటుదారులు వచ్చి 160 కి.మీ. పొడవునా కొండలపైనుంచి కాల్పులు జరిపారు. 

కొండల మీదున్న సైనిక స్ధావరాలు 16,000 అడుగుల ఎత్తులో (కొన్నైతే 18,000 అడుగుల ఎత్తులో) ఉన్నాయి.కార్గిల్ మీదే దాడికి దిగడానికి ముఖ్యకారణం, చుట్టూ ఉన్న ముఖ్యమైన సైనిక స్ధావరాలను స్వాధీన పర్చుకోవడం ద్వారా ఆ ప్రాంతం పై పట్టు సాధించడం.అంతేకాక ఎత్తైన ప్రదేశాన్ని ఆక్రమించు కోవడం వల్ల కింద నుంచి పోరాడేవారి సంఖ్య ఎన్నో రెట్లు అధికంగా ఉండాలి. దానికి తోడు గడ్డకట్టుకు పోయేంత చల్లటి ఉష్ణోగ్రతలు మరో అడ్డంకి.