Skip to content
- మే 3 – కార్గిల్‌లో పాకిస్తాన్ చొరబడిందని గొర్రెల కాపరులు చెప్పారు.
- మే 5 – భారత సైన్యం గస్తీ దళాన్ని పంపించింది. ఐదుగురు భారతీయ సైనికులను పట్టుకుని చిత్రహింస చేసి చంపేసారు.
- మే 9 -పాకిస్తాన్ సైన్యం చేసిన శతఘ్ని దాడిలో కార్గిల్ ఆయుధాగారం ధ్వంసమైంది.
- మే 10 – ద్రాస్, కక్సార్, ముష్ఖో సెక్టార్లలో చొరబాట్లు కనుగొన్నారు. భారత సైన్యం కాశ్మీరులోయ నుండి మరింత మంది సైనికులను కార్గిల్ సెక్టారుకు పంపించింది.
- మే 26 – చొరబాటుదారులపై భారత వాయుసేన దాడులు చేసింది.
- మే 27 – భారత వాయుసేన ఒక మిగ్-21 ను, ఒక మిగ్-27 ను కోల్పోయింది. ఫ్లైట్ లెఫ్టె. నచికేతను యుద్ధఖైదీగా పట్టుకున్నారు.
- మే 28 – వాయుసేనకు చెందిన ఎమ్‌ఐ-17 హెలికాప్టరును పాకిస్తాన్ కూల్చివేసింది. నలుగురు సిబ్బంది మరణించారు.
- జూన్ 1 – పాకిస్తాన్ దాడులను ముమ్మరం చేసింది. జాతీయ రహదారి 1ఎ పై బాంబులు వేసింది.
- జూన్ 5- ముగ్గురు పాకిస్తాన్ సైనికుల నుండి స్వాధీనం చేసుకున్న పత్రాలని భారత సైన్యం బయటపెట్టి పాకిస్తాన్ జోక్యాన్ని బయటపెట్టింది.
- జూన్ 6 – భారత సైన్యం పెద్ద ఎత్తున దాడి మొదలుపెట్టింది.
- జూన్ 9 – బటాలిక్ సెక్టారులో రెండు కీలక స్థావరాలను భారత సైన్యం తిరిగి స్వాధీన పరచుకుంది.
- జూన్ 11 – పాకిస్తాన్ సైనిక ప్రధానాధికారి జన. పర్వేజ్ ముషారఫ్, ఛీఫ్ ఆఫ్ జనరల్ స్టాఫ్ లెఫ్టె. జన. అజీజ్ ఖాన్ తో జరిపిన సంభాషణను బయటపెట్టి పాకిస్తాన్ సైన్యపు జోక్యాన్ని నిరూపించింది.
- జూన్ 13 – ద్రాస్ సెక్టారులోని తోలోలింగ్‌ను భారత సైన్యం స్వాధీనపరచుకుంది.
- జూన్ 15 – అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్‌తో టెలిఫోనులో మాట్లాడుతూ, కార్గిల్ నుండి తప్పుకోమని చెప్పాడు.
- జూన్ 29 – భారత సైన్యం టైగర్ హిల్ వద్ద ఉన్న రెండు కీలక స్థావరాలను పాయింట్ 5060, పాయింట్ 5100 స్వాధీనపరచుకుంది
- జులై 2 – భారత సైన్యం త్రిముఖ దాడిని మొదలుపెట్టింది.
- జులై 4-11 గంటల పోరు తరువాత, భారత సైన్యం టైగర్ హిల్‌ను తిరిగి స్వాధీనం చేసుకుంది
- జులై 5 – భారత సైన్యం ద్రాస్‌పై నియంత్రణ సాధించింది. క్లింటన్‌తో సమావేశం తరువాత, పాఅకిస్తాన్ ప్రధాని షరీఫ్ కార్గిల్ నుండి వెనక్కి వెళ్తున్నట్లు ప్రకటించాడు.
- జులై 7 – బటాలిక్ సెక్టారులోని జుబర్ హైట్స్‌ను భారత సైన్యం స్వాధీనం చేసుకుంది.
- జులై 11 – పాకిస్తాన్ వెనక్కి వెళ్ళడం మొదలైంది. బటాలిక్ లోని కీలక శిఖరాలను భారత సైన్యం స్వాఅధీనపరచుకుంది.
- జులై 14- ఆపరేషన్ విజయ్ విజయవంతమైందని భారత ప్రధాని వాజపాయి ప్రకటించాడు. పాకిస్తాన్‌తో చర్చలకు భారత్ షరతులు విధించింది.
- జులై 26 – కార్గిల్ యుద్ధం అధికారికంగా ముగిసింది. పాకిస్తాన్ చొరబాటుదారులను పూర్తిగా వెళ్ళగొట్టామని భారత సైన్యం ప్రకటించింది.