సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో అల్లు అర్జున్ వదినగా నటించిన ఈ హీరోయిన్ ఇప్పుడు ఏమి చేస్తుందో….?
ఐతే సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చి దాదాపు 30సినిమాలు చేసిన ముంబయి ముద్దుగుమ్మ సింధు తులాని దక్షిణాదిన అన్ని భాషల్లోనూ నటించింది. ఈమె తండ్రి స్టేట్ బ్యాంకు లో పనిచేసి రిటైరవ్వగా, తల్లి ఇండియన్స్ రైల్వేస్ లో జాబ్ చేస్తోంది. ఇక సింధు చెల్లి నేహా ఎయిర్ లైన్స్ లో ఉద్యోగం చేస్తోంది. పార్ట్ టైం డీజేగా చేస్తోంది. ఇక ఫెయిర్ అండ్ లవ్లీ మోడలింగ్ చేసిన సింధు గ్రాడ్యుయేషన్ కోర్సు పూర్తిచేసాకా థియేటర్ కోర్సు చేసింది. తమిళంలో అల్లుడిక్కుతూ అనే తమిళ మూవీతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సింధు అంతకుముందు మోడలింగ్ చేసింది.
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన అతనొక్కడే మూవీ ఆమెకు హీరోయిన్ గా మంచి పేరు తెచ్చింది. తమిళంలో శింబుతో మన్మధ మూవీలో చేసి కోలీవుడ్ లో కూడా పాగా వేసింది. హీరోయిన్ గా ఇంపార్టెన్స్ తగ్గాక కొన్ని ప్రధాన పాత్రలలో నటించింది. ఐటి ఇండస్ట్రీలో జాబ్ చేస్తున్న ఉత్తరాదికి చెందిన వ్యక్తిని పెళ్ళాడి ఏడాదిపాటు సినిమాలకు దూరంగా ఉంది. వీరికి శ్వేతా అనే కూతురుంది. పెళ్లాయ్యాక ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ చేయడానికి మొగ్గు చూపింది.
సన్నాఫ్ సత్యమూర్తి మూవీలో అల్లు అర్జున్ వదిన గా నటించింది. ఇష్క్,ధనలక్ష్మి తలుపు తడితే మూవీస్ లో కూడా నటించింది. బాలీవుడ్ నుంచి వచ్చినప్పటికీ తమిళ ,కన్నడ భాషల్లో ఒకటి రెండు సినిమాలు మాత్రమే చేశానని, తెలుగు పరిశ్రమ తనను ఎక్కువ ఆదరించిందని సింధు చెప్పుకొచ్చింది. టివి రంగంలో కూడా అడుగుపెట్టి సోనీ టివిలో కుటుంబ అనే సీరియల్ లో నటించింది. మణిరత్నం నాటకంలో కూడా తన ప్రతిభను చాటింది.