Movies

స్వాతిముత్యం లోని బాల నటుడు ఇప్పుడు సౌత్ ఇండియా టాప్ హీరో… ఎవరో తెలుసా?

భారతీయ సినీ చరిత్రలో ఒక దర్శకుడిగా ప్రత్యేక స్థానం సంపాదించినా అతి కొద్ది మంది దర్శకులలో K. విశ్వనాధ్ ఒకరు. ఈ దర్శకుడు వెండితెరపై సాంప్రదాయ విలువలను జోడించి ప్రేక్షకుల మదిలో చెరిగిపోని ముద్రను వేసుకున్నారు. ఎన్నో మరుపురాని సినిమాలను అభిమానులకు అందించారు. స్వాతిముత్యం, స్వయంకృషి,స్వర్ణ కమలం,ఆపద్భాందవుడు,స్వాతికిరణం వంటి ఎన్నో వైవిధ్యమైన సినిమాలను ప్రేక్షకులకు అందించారు.

విశ్వనాథ్ గారి సినిమాల్లో నటించే అవకాశం రావటం ప్రతి హీరో,హీరోయిన్ గొప్ప అదృష్టంగా భావిస్తారు. విశ్వనాథ్ గారి సినిమాలో బాలనటుడిగా నటించిన ఒక బాలుడు ఇప్పుడు సౌత్ ఇండియాలో టాప్ హీరోలలో ఒకరిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.ఆ హీరో ఎవరో కాదు. మనకు బాగా తెల్సిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. విశ్వనాధ్ గారి దర్శకత్వంలో వచ్చిన స్వాతిముత్యం సినిమాలో బన్నీ బాలనటుడిగా నటించాడు.

సినిమా మొదట్లో కమల్ హాసన్ మనవళ్లుగా కొంతమంది నటించి అలరించారు. వారిలో మన బన్నీ కూడా ఉన్నాడు. మిగతా పిల్లలందరూ కూడా బన్నీకి కజిన్స్ అని సమాచారం.ఆలా విశ్వనాథ్ గారి సినిమాలో అంత చిన్న వయస్సులో నటించటం తన అదృష్టం అని ఒకానొక ఇంటర్వ్యూ లో బన్నీ పాత జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకున్నాడు.

చిన్నతనంలోనే కమల్ హాసన్ తో నటించి పెద్దయ్యాక స్టైలిష్ స్టార్ గా ఎంతో అభిమానులను సంపాదించుకున్నాడు. ప్రసుతం సౌత్ ఇండియా టాప్ హీరోలలో ఒకరిగా ముందుకు దూసుకుపోతున్నాడు.