టాలీవుడ్ స్టార్స్ అసలు పేర్లు ఏమిటో తెలుసా?
ఎన్టీఆర్ అనగానే నందమూరి తారక రామారావు అని టక్కున చెప్పేస్తాం. ఎఎన్ఆర్… అంటే అక్కినేని నాగేశ్వరరావు అని చెప్పేయచ్చు. కానీ, ఇలా కొందరు ప్రముఖుల పేర్లు పూర్తిగా తెలియనివాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో కొందరు నిక్ నేమ్ ఫ్యామస్ అయిపోయి… అసలు పేరు తెలియని పరిస్థితి. బాపు బొమ్మ అందరికీ తెలుసు. కానీ బాపూ అసలు పేరు ఎందరికి తెలుసు? ఇక్కడ కొందరు తెలుగు ప్రముఖుల అసలు పేర్లు మీకోసం.
- జొన్నవిత్తుల : జొన్నవిత్తుల రామలింగేశ్వరశాస్త్రి
- సిరివెన్నెల : చేంబోలు సీతారామ శాస్త్రి
- జాలాది : జాలాది రాజారావు
- సాహితి : చెరుకుపల్లి శ్రీరామచంద్రమూర్తి
- వనమాలి : మణిగోపాల్
- వెన్నెలకంటి : వెన్నెలకంటి రాజేశ్వరప్రసాద్
- ఆరుద్ర : భాగవతుల సదాశివశంకరశాస్త్రి
- ఆచార్య ఆత్రేయ : కిళాంబి నరసింహాచార్యులు
- బాపు : సత్తిరాజు లక్ష్మీనారాయణ
- రేలంగి : రేలంగి వేంకటరామయ్య
- ఘంటసాల : ఘంటసాల వేంకటేశ్వరరావు
- రాజనాల : రాజనాల కాళేశ్వరరావు నాయుడు
- K.R.విజయ : దైవనాయకి
- శ్రీశ్రీ : శ్రీరంగం శ్రీనివాసరావు
- పినిసెట్టి : పినిసెట్టి శ్రీరామమూర్తి
- దాశరథి : దాశరథి కృష్ణమాచార్యులు
- అంజలి : అంజమ్మ
- దేవిక : ప్రమీల
- భానుప్రియ : మంగభామ
- జయప్రద : లలితారాణి
- రాజబాబు : పుణ్యమూర్తుల అప్పలరాజు
- జంధ్యాల : జంధ్యాల వీరవేంకటశివసుబ్రహ్మణ్యశాస్త్రి
- ఏ.వి.ఎస్ : A.V.సుబ్రహ్మణ్యం
- చిరంజీవి : కొణిదెల శివశంకర వరప్రసాద్
- కృష్ణభగవాన్ : పాపారావుచౌదరి
- చక్రవర్తి(సంగీత దర్శకుడు) : అప్పారావు
- శారద : తాడిపత్రి సరస్వతి దేవి
- శోభన్ బాబు : ఉప్పు శోభానా చలపతి రావు
- జయసుధ : సుజాత