హలో బ్రదర్‌లో నాగార్జునకు డూప్‌గా నటించింది ఎవరో తెలుసా ? ఇప్పుడు అతను టాప్ హీరో
నాగార్జున ద్విపాత్రాభినయం చేసిన ‘హలో బ్రదర్’ సినిమా అప్పట్లో సంచలనం సృష్టించింది. ఈ సినిమా E.V.V. సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన సినిమా. ఈ సినిమాలో రమ్యకృష్ణ,సౌందర్య హీరోయిన్స్ గా నటించారు. సినిమాలో నాగార్జున క్లాస్ గాను,మాస్ గాను నటించి అందరిని ఆకట్టుకున్నాడు. ఈ సినిమాకి సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే…నాగార్జున చేసిన రెండు రోల్స్ లో ఒక రోల్ కి ప్రముఖ వ్యక్తి డూప్ గా నటించాడు.
అప్పట్లో పెద్దగా ఇమేజ్ లేని శ్రీకాంత్ ఈ డూప్ గా కన్పించాడు. పాత్రల కోసం శ్రీకాంత్ అన్నపూర్ణ స్టూడియో చుట్టూ తిరుగుతున్న రోజుల్లో నాగార్జున కంటిలో పడ్డాడు. టైట్ షెడ్యూల్ లో రెండు పాత్రలను పోషించటానికి కష్టపడుతున్న నాగార్జునకు శ్రీకాంత్ సెట్ అవుతాడని అనిపించింది.
అప్పటికప్పుడే శ్రీకాంత్ ని సెట్ కి పిలిపించి కొలతలు తీయించారు. డైరెక్టర్ కూడా ఒకే చెప్పటంతో హలో బ్రదర్ సినిమాలో నాగార్జునకు డూప్ గా నటించాడు. కొన్ని ఫైట్స్,బ్యాక్ సైడ్ షాట్స్ కోసం శ్రీకాంత్ ని వాడుకున్నారు.
ఆ తర్వాతి రోజుల్లో శ్రీకాంత్ పెద్ద హీరోగా అయ్యిపోవటంతో ఈ విషయం మరుగున పడిపోయింది. అయితే శ్రీకాంత్ తాను పరిశ్రమకు వచ్చిన కొత్తలో పడిన కష్టాల గురించి అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటూ ఉంటాడు.