యూట్యూబ్ టాప్ ట్రెండింగ్ లో అదరగొడుతున్న ఈటీవీ షోలు!
ఈటీవీ ఛానెల్లో ప్రసారం అయ్యే ప్రతీ ఒక్క షోకు ఎనలేని క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే.అటు టీవీలోనూ ఇటు యూట్యూబ్ లో కూడా మొత్తం “ఢీ”, “జబర్దస్త్” మరియు “ఎక్స్ట్రా జబర్దస్త్” షోలు అదరగొడతాయి.గత కొన్ని రోజులు నుంచి యూట్యూబ్ లో ఈటీవీ కు సంబధించిన షోలు అదరగొడుతున్నాయి.
యూట్యూబ్ లోని ఆల్ ఇండియా టాప్ 5 ట్రెండింగ్ లో “జబర్దస్త్” నుంచి హైపర్ ఆది చేసిన హిలేరియస్ స్కిట్ ఒక్క రోజులోనే 29 లక్షల వ్యూస్ తో నెంబర్ 1 స్థానంలో ఉండగా మరియు అంతకంతకు ఉత్కంఠగా సాగుతున్న “ఢీ” క్వార్టర్ ఫైనల్స్ లేటెస్ట్ ఎపిసోడ్ మాత్రం నెంబర్ 2 స్థానంలో ఉంది. అలాగే నాలగవ స్థానంలో వచ్చే వారం ప్రసారం కాబోయే జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమో 29 లక్షల వ్యూస్ తో నిలిచింది.ఇలా మొత్తం టాప్ 5 వీడియోలలో మొత్తం 3 వీడియోలు ఈటీవీ ఛానెల్ కు చెందినవే ఉన్నాయి.