టాప్ హీరోయిన్స్ సమంత,నయనతార రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే..?
నాగచైతన్యతో పెళ్లి తర్వాత సమంత అక్కినేనికి కాలం కలిసి వచ్చినట్టు కనిపిస్తున్నది. వరుస సక్సెస్‌లతో దూసుకెళ్తున్న ఈ బ్యూటీ.. తాజాగా ఈ ఏడాది రెండో హిట్‌ను కూడా ఖాతాలో వేసుకొన్నది. ఇటీవల విడుదలైన ఓ బేబీ సినిమా మంచి విజయం సాధించడంతో సమంత రెంజ్ మరో లెవెల్‌కు వెళ్లింది. అంతేకాకుండా సమంత బాక్సాఫీస్ స్టామినా కూడా పెరిగింది. దాంతో తాజాగా తన రెమ్యునరేషన్ భారీగా పెంచినట్టు సమాచారం. తదుపరి సినిమాకు ఆమె ఎంత పారితోషికం తీసుకొంటున్నారంటే..ఓ బేబీ సినిమాకు ముందు వరకు సమంత అక్కినేని రెమ్యునరేషన్ సుమారు రూ.2 కోట్లు ఉందనేది సినీ వర్గాల సమాచారం. అయితే ఓ బేబీ విజయం తర్వాత సమంత తన బాక్సాఫీస్ సత్తాను తెలుసుకొని భారీగా పారితోషికాన్ని పెంచేసిందంట.
ఓ బేబి సినిమాకు సమంత 2 కోట్లు తీసుకోగా, ఇక ముందు నటించే సినిమాలకు రూ.1 కోటీ పెంచేసినట్టు..అంటే మూడు కోట్లకు రెమ్యునరేషన్ ఫిక్స్ చేసిందట.తాజా రెమ్యునరేషన్ పెంపుతో సమంత అత్యధికంగా పారితోషికం తీసుకొనే అగ్ర హీరోయిన్ల జాబితాలో చేరిపోయింది. దక్షిణాదిలోనే హయ్యెస్ట్ రెమ్యునరేషన్ తీసుకొనే హీరోయిన్‌గా రెండో స్థానంలో నిలిచింది. సౌత్‌లో అత్యధిక పారితోషికం తీసుకొనే వారిలో నయనతార ముందున్నారు. తాజా పెంపుతో ఆమెకు సమంత చేరువైంది.దక్షిణాదిలో ఇటీవల కాలంలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకొనే వారిలో నయనతారకే అగ్రతాంబూలం.
ప్రతీ సినిమాకు నయనతార రూ.5 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకొంటున్నట్టు ట్రేడ్ వర్గాల సమాచారం. వరుస విజయాలు పలకరించడంతో మరింత పారితోషికాన్ని కూడా నయనతారకు చూపుతున్నారని తెలుస్తున్నది.
స్టార్ హీరోయిన్లుగా రాణిస్తున్నప్పటికీ.. ఇప్పటికీ హీరో, హీరోయిన్ల రెమ్యునరేషన్ విషయంలో భారీగా వ్యత్యాసం ఉన్నట్టు విమర్శలు వస్తున్నాయి. అలాంటి వాటికి నయనతార, సమంత పారితోషికాలు సరిగానే సమాధానం చెప్పేలా ఉన్నాయనే మాట వినిపిస్తున్నది.
ఈ ఇద్దరు హీరోయిన్లు మిగితా యువ తారలకు ఆదర్శంగా నిలుస్తారని భావిస్తున్నారు.ఇక ఓ బేబీ సినిమా తర్వాత, సమంత అక్కినేని మన్మథుడు 2 సినిమాలో అతిథి పాత్రలో కనిపించనున్నది. నాగార్జున, రకుల్ ప్రీత్ నటిస్తున్న ఈ చిత్రానికి హీరో, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. 17 ఏళ్ల క్రితం వచ్చిన మన్మథుడు సినిమాకు కొనసాగింపుగా ఈ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే.