Bharat Ratna

భారత రత్న మొదట అందుకున్న వీరి గురించి మీకు తెలుసా?

భారత రత్న అనేది మనదేశంలో ఉన్న అన్ని పురస్కారాలకన్నా అత్యుత్తమమైనది. దీనిని 1954 వ సంవత్సరంలో మన దేశ రాష్ట్రపతి డా. రాజేంద్రప్రసాద్ గారి చేత స్థాపించబడినది. అయితే ఈ పురస్కారం మొదటిగా 1954 వ సంవత్సరంలో ముగ్గురు మహానుభావులకు అందింది. ఆ ముగ్గురు ఎవరంటే … సర్వేపల్లి రాధాకృష్ణన్ ,చక్రవర్తుల రాజగోపాలాచారి ,డా.సి.వి.రామన్. 

ముందుగా మనం సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి గురించి మాట్లాడుకుందాం … మన సమాజానికి ఆయన చేసిన కృషికి గుర్తింపుగా భారత రత్న పురస్కారం ఇవ్వడం జరిగింది. ఆయన ఒక గొప్ప గురువు. ఆయన పుట్టినరోజు ని   ఉపాధ్యాయ దినోత్సవంగా .జరుపుకుంటాం. 

ఇప్పుడు చక్రవర్తుల రాజగోపాలాచారి గారి గురించి తెలుసుకుందాం …ఈయన భారత స్వతంత్ర పోరాటంలో బాగా పాలుపంచుకున్నారు. అలాగే మద్రాస్ ప్రాంతానికి ముఖ్యమంత్రిగా కొన్ని సంవత్సరాలు భార్యతలను నిర్వర్తించారు. 

ఇప్పుడు డా.సి.వి.రామన్ గారి గురించి తెలుసుకుందాం … భారతదేశానికి చెందిన ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త. రామన్‌ ఎఫెక్ట్‌ను ఈయన కనిపెట్టారు . 1930 డిసెంబరులో రామన్‌గారికి  నోబెల్‌ బహుమతి వచ్చింది.