శోభన్ బాబు వందల కోట్ల ఆస్థిని ఎలా సంపాదించాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
టాలీవుడ్ లో స్టార్ హీరోలు దాదాపుగా 25 నుంచి 30 కోట్ల వరకు పారితోషికాన్ని అందుకుంటున్నారు. దాంతో సినిమా బడ్జెక్ట్ లో సగం పారితోషికానికే అయ్యిపోతుందని అనుకునేవాళ్లు ఉన్నారు. పారితోషికం అనేది ఆనాటి రోజుల్లో కూడా భారీగానే ఉండేది. ఆ రోజుల్లో నిర్మాతలు హీరోల వెంట పడి పోటాపోటీగా కాంట్రాక్ట్ లు కుదుర్చుకొనేవారు. శోభన్ బాబు,కృష్ణ,చంద్ర మోహన్ హయాంలోనే ఇలా కాంటాక్ట్స్ కుదుర్చుకొనేవారు. అందుకే శోభన్ బాబు కోట్ల రూపాయిల ఆస్తిని సంపాదించాడు. 25 సంవత్సరాల క్రితమే కృష్ణ,శోభన్ బాబు లక్షల్లో పారితోషికాన్ని తీసుకొనేవారు. ఇప్పుడు కోట్లు ఎలాగో అప్పుడు లక్షలు అలాగే. ఇప్పుడు సినిమాలను కోట్లలో నిర్మిస్తూ ఉంటే అప్పట్లో సినిమాలను లక్షల్లో నిర్మించేవారు.
ఆనాటి స్టార్స్ వారి డిమాండ్ ని బట్టి పారితోషికం తీసుకొనేవారు. హీరోల పారితోషికాలు ఆకాశానికి అంటటంతో మూవీ అసోషియేషన్ ఏ హీరో అయినా సినిమాకి పది లక్షలు మించి పారితోషికం తీసుకోకూడదని రూల్ పెట్టింది. ఒకవేళ తీసుకుంటే మా నుండి మీకు ఎటువంటి సహకారం ఉండదని తెచ్చి చెప్పింది. ఈ రూల్ కి సోగ్గాడు శోభన్ బాబు తీవ్రంగా వ్యతిరేకించారు.
నిర్మాతలు 15 లక్షలు పట్టుకొని మా చుట్టూ తిరుగుతూ ఉంటే తీసుకోవద్దు అని చెప్పటానికి మీరెవరు అంటూ అసోషియేషన్ ని తిట్టేశారట శోభన్ బాబు. ఆలా ఆ రూల్ బ్రేక్ అయ్యిపోయింది. దాంతో శోభన్ బాబు సంపాదించిన డబ్బును భూముల మీద పెట్టటంతో లక్షలు కాస్త కోట్లుగా మారిపోయాయి. ఆలా శోభన్ బాబు సంపాదించినా డబ్బును బాగా ఇన్వెస్ట్ చేసారు. అయన చేయటమే కాకుండా తోటి నటులకు కూడా భూముల మీద ఇన్వెస్ట్ చేయమని చెప్పేవారట.