Movies

పడమటి సంధ్యారాగం సినిమాలో విజయశాంతితో జోడి కట్టిన హీరో ఇప్పుడు ఎక్కడ,ఏమి చేస్తున్నాడో తెలుసా?

అవకాశం కోసం ఎదురు చూస్తూ,నానా అగచాట్లు పడుతూ చివరకు ఓ సినిమాలో ఛాన్స్ వస్తే ఎగిరి గంతేయ్యడం సహజమే కదా. అలా సినీమాల్లో ఎంట్రీ ఇచ్చి ఆతర్వాత కనిపించకుండా పోయేవాళ్లు వున్నారు. అయితే మరో భాషలో అవకాశలు తన్నుకుంటూ స్థిరపడేవాళ్ళూ వున్నారు. ఇక మనం చెప్పబోయే హీరో,తెలుగులో ఛాన్స్ దక్కించుకుని,మంచి ఫెరఫార్మెన్స్ కనబరిచి ఆ తర్వాత హాలీవుడ్ లో పెద్ద స్టార్ గా రాణిస్తున్న వ్యక్తి ఒకరు వున్నారు ఆయన ఎవరో కాదు. హాస్య బ్రహ్మ జంధ్యాల దర్శకత్వంలో ఆ మధ్య వచ్చిన పడమటి సంధ్యారాగం మూవీ గుర్తుంది కదా.

ఆ సినిమాలో ఓ అమెరికా అబ్బాయి నటించి మెప్పించాడు. అతడి పేరు థామస్ జేమ్. హీరోయిన్ విజయశాంతి సరసన నటించి మంచి మార్కులే కొట్టేసాడు. ఆ సినిమా టివీల్లోనో, యూట్యూబ్ లోని ఈ సినిమా వీక్షిస్తున్నప్పడు ఇందులో హీరో ఎక్కడ ఎలా వున్నాడో కదా అని అనుకోవడం సహజం.
అయితే యితడు హాలీవుడ్ లో అగ్రశ్రేణి హీరో గా వున్నాడు. ఇతని బ్యాక్ గ్రౌండ్ కి వెళ్తే, సినిమాల్లో ఛాన్స్ ల కోసం హాలీవుడ్ చుట్టూ తిరుగుతూ ,కనీసం తినడానికి తిండిలేక,నానా అగచాట్లు పడుతూ ఎవరు ఛాన్స్ ఇస్తారా అని వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నాడు.ఇక అదే సమయంలో పడమటి సంధ్యారాగం సినిమా లో అమెరికా అబ్బాయి ని హీరోగా ఎంపిక చేసి, అక్కడే షూటింగ్ చేయాలని జంధ్యాల తన చిత్రబృందంతో అమెరికా వెళ్లారు.

అక్కడ జేమ్ ఫోటో చూసి, అతన్నే హీరోగా కన్ఫర్మ్ చేసేసారు. సినిమాల్లో అవకాశం కోసం పడిగాపులు కాస్తున్న జాన్ మరోపక్క తిండికి అలమటిస్తున్నారు. సరిగ్గా ఆసమయంలో వచ్చిన ఛాన్స్ తో పరమాన్నం దొరికినట్టు ఉబ్బి తబ్బిబ్బయ్యాడు. తెలుగు భాష గురించి తెలియని అతడు ఆ సినిమాలో వేసిన హీరో వేషం రక్తి కట్టింది. ఆ సినిమాకి అతనికి ముట్టింది అక్షరాలా 25వేల రూపాయలు.
ఇక ఆతర్వాత హాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన జేమ్ వరుస సూపర్ హిట్ మూవీస్ తో తిరుగులేని హీరో అయ్యాడు. తాను ఎన్ని కష్ఠాలు పడ్డాడో ఓ ఇంటర్యూలో వెల్లడిస్తూ,ఇలా చెప్పుకోడానికి ఎప్పుడూ సిగ్గు పడనని, ఎందుకంటే ఆనాటి పరిస్థితులు అలాంటివని చెప్పుకొచ్చాడు. మొత్తానికి కష్టాలను అధిగమించి ఓ స్టార్ హీరోగా నిలదొక్కువడం ఆనందంగా ఉందన్నాడు. కాగా జేమ్ నటించిన ‘డీ బ్లు సి’ హాలీవుడ్ మూవీ ఆ మధ్య తెలుగులో డబ్బింగ్ అయ్యింది కూడా.