ఈ హీరోల భార్యలు తమ భర్తల కంటే ఎక్కువ సంపాదిస్తున్నారు….ఎలాగో చూడండి
సెలబ్రిటీల జీవితాలు ఎప్పడు రహస్యంగానే ఉంటాయి . కానీ ప్రస్తుతం సోషల్ మీడియా పుణ్యమా అన్ని విషయాలు అందరికి తెలిసిపోతున్నాయి. మన టాలీవుడ్ హీరోల భార్యలు వారి భర్తల కన్నా ఎక్కువ సంపాదిస్తున్నారు. ఎలా ఎంత సంపాదిస్తున్నారో ఒకసారి తెలుసుకుందాం. నేచురల్ స్టార్ నాని అంజనాను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. నానీ భార్య అంజనా బెంగళూరు నిఫ్ట్ లో ఫ్యాషన్ డిజైనర్ గా శిక్షణ తీసుకుంది. ప్రస్తుతం ఆమె రాజమౌలి ఆర్కామీడియాలో క్రియేటివ్ డిపార్ట్ మెంట్ హెడ్ గా పని చేస్తుంది. బాహుబలి క్యాస్టూమ్స్ విషయంలో కీలకపాత్ర అంజనాదే.
యాంకర్ సుమ గురించి తెలియని వారు ఉండరు. ఆమె ఒక యాంకరింగ్ చేస్తూనే సొంతగా నిర్మాణ సంస్థలో షోస్ చేస్తూ బిజీగా ఉంది. ఆమె ఎప్పుడు రెస్ట్ తీసుకుంటుందో ఎవరికీ తెలియదు. ఆమె సంపాదన భర్త రాజీవ్ కన్నా ఎక్కువే. ఉపాసన గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆమె అపోలో హాస్పిటల్ లో చురుకైన పాత్రతో పాటు..సోషల్ యాక్టివిటీస్ లో కూడా పాల్గొంటుంది. ఆమె నిత్యం సోషల్ మీడియాలో టచ్ లో ఉంటుంది .
అల్లరి నరేశ్ భార్య విరూప ఈవెంట్ మానేజర్ గా చేస్తుంది.ఒక్క ఈవెంట్ కే లక్షలు ,కోట్లల్లో టారిఫ్ ఉండే వాటిల్లో విరూప సంపాదన అల్లరి నరేశ్ సంపాదన కంటే రెట్టింపు.ఉంటుంది.స్నేహారెడ్డి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ భార్య స్పెక్ట్రం అనే మ్యాగజీన్ కి ఛీఫ్ ఎడిటర్ గా పనిచేస్తుంది.విదేశాల్లో చదువుకున్న స్నేహ పెళ్లికి ముందు కూడా తన తండ్రి స్థాపించిన సెయింట్ ఇన్స్టిట్యూట్ బాద్యతలు చూసుకునేది.ఇప్పుడు ఇద్దరు పిల్లల తల్లీగా ఉంటూ ఇటుతల్లి పాత్ర అటు మ్యాగజీన్ ఎడిటర్,మరోవైపు సెయింట్ ఇన్స్టిట్యూట్స్ ని చూసుకుంటుంది.
అందాల రాక్షసి హీరో రాహుల్ రవీంద్రన్ తన భార్య తన కన్నా ఎక్కువ ఇన్ కం ట్యాక్స్ పే చేస్తుందని ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు.ఆమె ఎవరో కాదు గాయని చిన్మయి..ఏం మాయ చేసావ్ సినిమాలో సమంతా కి డబ్బింగ్ చేసింది కూడా ఈమె.