Independence Day

ఆగస్టు-15న జాతీయ జెండా ఎగురవేయనున్న ధోని

మాజీ టీమిండియా కెప్టెన్, గౌరవ లెఫ్టినెంట్ హోదాలో మహేంద్ర సింగ్ ధోనీ ఆగస్టు 15వ తేదీన జెండా లద్దాక్ లోని లేహ్ ప్రాంతంలో జాతీయ జెండా ఎగురవేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. క్రికెట్ కు షార్ట్ బ్రేక్ ఇచ్చిన ధోనీ.. పుల్వామా జిల్లా క్రూ ప్రాంతంలో రెజిమెంట్ యూనిట్ లో బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. అయితే ఆగస్టు 10వ తేదీన ధోనీ, తన బృందంతో లేహ్ కు వెళ్లనున్నాడని సమాచారం. అక్కడే ఆ జాతీయ జెండాను ఆవిష్కరించనున్నట్లు తెలుస్తోంది. 


ఇటీవలే కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. జమ్మూ కశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని మోడీ ప్రభుత్వం ఇటీవలే రద్దు చేసింది. జమ్మూ కశ్మీర్, లద్దాక్ లను కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటించేసింది. ప్రస్తుతం ధోనీ జెండా ఇక్కడ ఎగురవేస్తారని ప్రచారం జరుగుతుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. 

వరల్డ్ కప్ 2019లో భారత్ నిష్క్రమించినప్పటి నుంచి మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్ మెంట్ తీసుకుంటాడనే చర్చ జరిగింది. వెస్టిండీస్ పర్యటన నుండి తాను తప్పుకుంటున్నట్లు..రెండు నెలల పాటు క్రికెట్ కు తాత్కాలిక బ్రేక్ ఇచ్చాడు ధోనీ. అనంతరం సైనిక బలగాలతో ట్రైనింగ్ క్యాంప్‌లో కలిశాడు. ఆర్మీ విధుల్లో పాల్గొంటున్నాడు. గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదా పారాచూట్ రెజిమెంట్ లో విధులు నిర్వహిస్తున్నాడు. ఆగస్టు 15 వరకు అతను విధుల్లో కొనసాగుతాడని ఆర్మీ ఆఫీసర్స్ వెల్లడిస్తున్నారు.