జాతీయ జెండా రూల్స్ ఏమిటో తెలుసా?
భారత జాతీయ జెండాను 1947, జులై 22న నిర్వహించిన రాజ్యంగ సభలో పింగళి వెంకయ్య రూపొందించిన జెండాను భారత జాతీయ జెండాగా ఆమోదించారు.
జాతీయ జెండాను ఖాదీ వస్త్రంతోనే తయారుచేయాలి.
దేశీయ ఉత్పత్తులకు చెందిన ఖద్దరు జెండా,జనపనార తాడు ఉపయోగించాలి.
2:3 నిష్పత్తిలో ఉన్న జెండా వాడాలి.
జెండాలో కాషాయం రంగు పైన ఉండేలా చూడాలి.
సిల్క్,నైలాన్ తాళ్లను వాడకూడదు.
జెండాను సగం వరకు ఎగరవేసి ఆపకూడదు.
జెండా వేగురవేసే సమయంలో చెప్పులు వేసుకోకూడదు.
జెండా వేగురవేసే సమయంలో శబ్దం చేయరాదు.
ప్లాస్టిక్ జెండాలను వాడకూడదు.
జెండా పై నుంచి కింద వరకు 3 రంగులు సమానంగా ఉండాలి.
జెండాపై ఎలాంటి రాతలు ఉండకూడదు.
జెండా మధ్యలో ఉండే ధర్మ చక్రంలో 24 ఆకులు ఉండాలి.