ఆగష్టు 15 రాఖీ పౌర్ణమి రోజు ఏ సమయంలో రాఖీ కడితే ఆయుర్ ఆరోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయో తెలుసుకోండి
రాఖీ పౌర్ణమి రోజు సోదరి సోదరుని మణికట్టుకు ఒక దారాన్ని కట్టి సోదరుడికి ఆయుషు, ఆరోగ్యం ఉండాలని కోరుకుంటుంది. అప్పుడు ఆ సోదరుడు ఆ సోదరికిజీవితాంతం ఏ ఆపద రాకుండా కాపాడతానని వాగ్దానం చేస్తాడు.అయితే రాఖీ కట్టటానికి కూడా సమయం ఉంటుంది. ఆ సమయం గురించి తెలుసుకొని ఆ సమయంలో కడితే అష్ట ఐశ్వరం సొంతం అవుతుంది. కట్టిన సోదరికి,కట్టించుకున్న సోదరుడికి కూడా మంచి జరుగుతుంది. ఇప్పుడు ఆ సమయం గురించి తెలుసుకుందాం.ప్రతి రాఖీ పౌర్ణమి రోజు బద్ర సమయం ఉంటుంది.
ఆ సమయంలో రాఖీ కట్టకూడదు. జ్యోతిష్యులు ఏదైనా మంచి పని చేసినప్పుడు చేయకూడని సమయాన్ని బద్ర అని పిలుస్తారు. బద్ర సమయం,దుర్ముహర్తము సమయాలలో రాఖీ ముడులు వేయకూడదు. అశుభ గడియలు,రాహుకాలం మరియు యమ గడియల సమయంలో కట్టకూడదు.రాఖీ పౌర్ణమి ఆగస్టు 15 న వచ్చింది. అయితే పౌర్ణమి తిది ఆగస్టు 14 బుధవారం మధ్యాహ్నం 3 గంటల 45 నిమిషాలకు ప్రారంభం అయ్యి ఆగస్టు 15 గురువారం సాయంత్రం 5 గంటల 58 నిమిషాల వరకు ఉంటుంది. అయితే మన పెద్దవాళ్ళు చెప్పిన దాని ప్రకారం సోదరుడు అన్ని వేళల సుఖ సంతోషాలతో, చేసే ప్రతి పనిలోను విజయం సాధించాలని మంచి మనస్సుతో సోదరి శుభ ముహర్తంలో రాఖి కడితే సోదరుడు జీవితంలో అన్ని కష్టాల నుండి బయట పడి ఉన్నతమైన స్థానానికి వెళతాడు.
అందువల్ల రాఖీ కట్టటానికి ఆగస్టు 15 న ఉదయం 5 గంటల 53 నిమిషాల నుండి సాయంత్రం 5 గంటల 58 నిమిషాల మధ్యలో మంచి సమయం అని చెప్పాలి. భద్ర సమయంలో రాఖీ కట్టకూడదని చెప్పుకున్నాం కదా. ఆగస్టు 15 రాఖీ రోజున భద్ర సమయం సూర్యోదయం ముందే ముగుస్తుంది. కాబట్టి ఆగస్టు 15 న రాఖీ పౌర్ణమి రోజున సంతోషంగా రాఖి కట్టండి. అయితే రాఖీ పౌర్ణమి రోజున ఉదయాన్నే తలస్నానము చేసి మీరు కట్టే రాఖీని దేవుని దగ్గర పెట్టి దీపారాధన చేసి ఇస్తా దైవానికి పూజ చేసి సోదరుడు అష్ట ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని, నాతో జీవితాంతం అన్యోన్యంగా ఉండాలని కోరుకోవాలి. సోదరుణ్ణి తూర్పు ముఖంగా కూర్చోబెట్టి నుదుటిన తిలకం పెట్టి రాఖీ కట్టి హారతి ఇచ్చి నోరు తీపి చేయాలి.