Devotional

రాఖీ పౌర్ణమి రోజు ఏ రంగు రాఖీ కడితే ఐశ్వర్యం కలుగుతుందో తెలుసా?

రాఖీ, రక్షా బంధన్ లేదా రాఖీ పౌర్ణమి అని పిలిచే ఈ పండుగను కొన్ని ప్రాంతాలలో శ్రావణ పౌర్ణమి లేదా జంద్యాల పౌర్ణమి అని కూడా పిలుస్తారు. అన్నాచెల్లెళ్లు లేదా అక్కాతమ్ముళ్ల మధ్య ఉన్న ప్రేమ,ఆప్యాయతలకు సూచకంగా ఎంతో వైభవంగా జరుపుకుంటారు. 2020 వ సంవత్సరం వికారి నామ సంవత్సరంలో శ్రావణ మాసంలో శుక్ల పక్ష పౌర్ణమి రోజున అంటే ఆగస్టు 3 వ తేదీన రాఖీ పండుగను జరుపుకుంటున్నాం. అయితే ఏ రాశివారు ఏ రంగు రాఖీ కడితే సోదరులకు మంచి జరుగుతుందో వివరంగా తెలుసుకుందాం. 

  • మేష రాశి మేష రాశి కుజ గ్రహానికి ఆధిపత్యం వహిస్తుంది. కుజ గ్రహానికి  అధిపతి మంగళదేవుడు. అందువల్ల రాఖీ రోజున ఎరుపు రంగు లేదా కాషాయం  లేదా పసుపు రంగు రాఖీని సోదరుడికి కడితే సోదరుడి జీవితంలో అన్నింటా విజయం లభిస్తుంది 
  • వృషభ రాశి వృషభ రాశి శుక్ర గ్రహానికి ఆధిపత్యం వహిస్తుంది. అందువల్ల నీలం రంగు రాఖీని సోదరుడికి కడితే సోదరుడి జీవితంలో అపజయం అనేది ఉండదు. అలాగే వెండి రంగు రాఖీ కూడా కట్టవచ్చు. 
  • మిధునరాశి మిధునరాశికి బుధగ్రహం ఆధిపత్యం వహిస్తుంది. అందువల్ల ఆకుపచ్చ లేదా తెల్లని రాఖీని సోదరుడికి కడితే సోదరుడి జీవితంలో అనుకోని అదృష్టం కలుగుతుంది. 
  • కర్కాటక రాశి కర్కాటక రాశి చంద్ర గ్రహానికి ఆధిపత్యం వహిస్తుంది. అందువల్ల రాఖీ రోజున తెల్లని రాఖి సోదరునికి కడితే జీవితంలో మానసిక ప్రశాంతత కలుగుతుంది . 
  • సింహ రాశి సింహ రాశికి సూర్య గ్రహం ఆధిపత్యం వహిస్తుంది. అందువల్ల ఎరుపు,పసుపు,గంధం రంగు,గులాబీ రంగులలో ఏ రంగు రాఖీ అయినా సోదరుడికి కడితే సోదరుడి జీవితంలో ఆనందం వస్తుంది. 
  • కన్యా రాశి కన్య రాశికి బుధగ్రహం ఆధిపత్యం వహిస్తుంది. అందువల్ల ఆకుపచ్చ లేదా తెల్లని రాఖీని సోదరుడికి కడితే సోదరుడి జీవితంలో అనుకోని అదృష్టం కలుగుతుంది. 
  • తుల రాశి తుల రాశికి శుక్ర గ్రహానికి ఆధిపత్యం వహిస్తుంది. అందువల్ల నీలం రంగు రాఖీని సోదరుడికి కడితే సోదరుడి జీవితంలో అపజయం అనేది ఉండదు. అలాగే వెండి రంగు రాఖీ కూడా కట్టవచ్చు. 
  • వృశ్చిక రాశి వృశ్చిక రాశి కుజ గ్రహానికి ఆధిపత్యం వహిస్తుంది. కుజ గ్రహానికి  అధిపతి మంగళదేవుడు. అందువల్ల రాఖీ రోజున ఎరుపు రంగు లేదా కాషాయం  లేదా పసుపు రంగు రాఖీని సోదరుడికి కడితే సోదరుడి జీవితంలో అన్నింటా విజయం లభిస్తుంది 
  • ధనస్సు రాశి ధనస్సు రాశి గురు గ్రహానికి ఆధిపత్యం వహిస్తుంది. అందువల్ల రాఖీ రోజున పట్టు దారంతో పసుపు రంగుతో ఉన్న రాఖి సోదరునికి కడితే జీవితంలో ఎప్పుడు ముందగుడు వేస్తారు. 
  • మకర రాశి మకర రాశి శని గ్రహానికి ఆధిపత్యం వహిస్తుంది. అందువల్ల ముదురు రంగు రాఖి  సోదరునికి కడితే జీవితంలో ఉన్నత స్థితికి వెళతారు. 
  • కుంభ రాశి కుంభ రాశి కూడా శని గ్రహానికి ఆధిపత్యం వహిస్తుంది. అందువల్ల ముదురు రంగు రాఖీ  సోదరునికి కడితే జీవితంలో ఉన్నత స్థితికి వెళతారు. 
  • మీనా రాశి మీనా రాశి  గురు గ్రహానికి ఆధిపత్యం వహిస్తుంది. అందువల్ల రాఖీ రోజున పట్టు దారంతో పసుపు రంగుతో ఉన్న రాఖి సోదరునికి కడితే జీవితంలో ఎప్పుడు ముందగుడు వేస్తారు. 
  • చూసారుగా ఫ్రెండ్స్ ఏ రాశివారు ఏ రంగు రాఖి సోదరునికి కడితే అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయో అలాగే జీవితంలో ఉన్నత స్థితికి చేరుకుంటారో మీరు కూడా రాశిని బట్టి ఆగస్టు 3 రాఖి పౌర్ణమి రోజు రాఖిని  సోదరునికి కట్టండి.