Movies

“జానీ” సినిమా ఆడకపోవడానికి అసలు కారణం అదేనా …???

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళవారం నాడు హైదరాబాద్ లోని ఫిలిం ఛాంబర్ లో ఏర్పాటు చేసిన ప్రముఖ రచయిత, పత్రిక సంపాదకుడు, రాజకీయ విశ్లేషకుడు తెలకపల్లి రవి రాసినటువంటి “మన సినిమాలు అనుభవాలు” పుస్తకావిష్కరణ సభలో మాట్లాడుతూ తన జానీ సినిమా ప్రస్తావన తీసుకొచ్చాడు. ఈమేరకు మాట్లాడిన పవన్ కళ్యాణ్… నా జానీ సినిమా ఎందుకు ఆడలేదో అందరికంటే కూడా నాకు బాగా తెలుసు. అసలు నిజానికి నేను రాసుకున్న కథ వేరు. కానీ తెరకెక్కించిన కథ వేరు. కేవలం కమర్షియల్ యాంగిల్ లో పది అనుకున్న కథను తెరకెక్కించడంలో విఫలమయ్యాను అని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. కానీ నిజానికి పరుచూరి సోదరుల గొప్పదనం ఏంటంటే ఒక సామాజిక సమస్యను కమర్షియల్ విలువలు ఉంటూనే మనం ప్రభావితం అయ్యేలా రాయగలరు. అంతటి శక్తి వారికి మాత్రమే ఉందని పొగిడారు.

అంతేకాకుండా సావిత్రి గారి కోసం, రంగారావు గారికోసం ఈ జెనరేషన్ లో ఎవరికీ సరిగా తెలియదు. కానీ సావిత్రి గారి బయోపిక్ తీస్తేనే గాని ఆమె సామర్థ్యం మనకు తెలిసింది. ఇక సినిమాలు నిజ జీవితాన్ని ఎంత ప్రభావితం చేస్తాయో, అలాగే నిజ జీవితాలు కూడా సినిమాలను అంతే ప్రభావితం చేస్తాయని పవన్ కళ్యాణ్ తెలిపారు. కాగా అలాంటి సినిమాలకు ఎంతో ప్రతిష్టాత్మకమైన జాతీయ అవార్డులు రావడం నిజంగా చాలా ఆనందంగా ఉందని పవన్ కళ్యాణ్ తెలిపారు.