Movies

గోపీచంద్ కి ఎంత కట్నం ఇచ్చారో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!!

టి. కృష్ణ కొడుకుగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన గోపీచంద్ చాలా తక్కువ సమయంలోనే మినిమమ్ గ్యారెంటీ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. గోపీచంద్ సినిమాల కారణంగా ఇప్పటి వరకు ఎవరు నష్టపోలేదు. కాబట్టే గోపీచంద్ సక్సెస్ గా కెరీర్ ని కొనసాగిస్తున్నాడు. టాలీవుడ్ లో గోపీచంద్ మీద ఒక సెంటిమెంట్ కూడా ఉంది.

అది ఏమిటంటే హీరోయిన్స్ కెరీర్ మొదట్లో గోపీచంద్ సరసన నటిస్తే లక్ కలిసి వస్తుందని నమ్ముతారు. అందుకే ఇప్పుడు కొత్తగా వచ్చే హీరోయిన్స్ గోపీచంద్ సరసన నటించటానికి ఒకే చెప్పేస్తూ ఉంటారు. రాశి ఖన్నా,రకుల్ వంటి వారు గోపీచంద్ సరసన నటించి స్టార్ డమ్ సంపాదించారు.

అయితే గోపీచంద్ సినీ కెరీర్ బిల్డప్ అంత సులువుగా జరగలేదు. గోపీచంద్ తండ్రి చిన్నతనంలో చనిపోతే తల్లి అన్ని తానై గోపీచంద్ ని పెంచింది. గోపీచంద్ విద్యాభ్యాసం ఒంగోలు,హైదరాబాద్ లలో సాగింది. రష్యాలో ఇంజనీరింగ్ పూర్తి చేసి 2001 లో స్నేహ హీరోయిన్ గా గోపీచంద్ తొలివలపు సినిమా చేసాడు. ఆ సినిమా ఆశించిన స్థాయిలో హిట్ కాలేదు. దాంతో జయం,నిజం,వర్షం వంటి సినిమాల్లో విలన్ గా నటించి మంచి పేరు సంపాదించాడు.

అయితే విలన్ గా మంచి పేరు వచ్చిన గోపీచంద్ లో హీరో అవ్వాలని కోరిక చాలా బలంగా ఉండటంతో మరల హీరోగా వచ్చి యజ్ఞం సినిమాతో హిట్ కొట్టాడు. ఇక ఆ తరువాత లక్ష్యం ,సౌర్యం ,రణం ,లౌక్యం ,గౌతం నంద అంటూ గోపీచంద్ కి వెనక్కి తిరిగి చూసుకొనే అవకాశం లేకుండానే ముందుకు దూసుకుపోయి మినిమమ్ గ్యారెంటీ హీరోగా స్థిరపడ్డాడు. 2013 లో పెళ్లి చేసుకోవాలని అనుకున్న గోపీచంద్ కి మొదటి ప్రయత్నమే బెడిసికొట్టింది. దాంతో కొంతకాలం పెళ్లి ప్రయత్నాలకు బ్రేక్ ఇచ్చి సినిమాలతో గడిపేశాడు.

ఆ తర్వాత శ్రీకాంత్ అక్క కూతురు రేష్మను వివాహం చేసుకున్నాడు. వీరి పెళ్లి హైదరాబాద్ లో చాలా వైభవంగా జరిగింది. సినీ,రాజకీయ,వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు హాజరు అయ్యే గోపీచంద్ దంపతులను ఆశీర్వదించారు. గోపిచంద్ కి రేష్మ తండ్రి భారీగానే కానుకలు ఇచ్చినట్టు వార్తలు వచ్చాయి.

గోపీచంద్ పెళ్ళికి కోటి ఏభై లక్షలు ఖర్చు చేసాడు. అయితే గోపీచంద్ కట్నంగా దాదాపుగా 8 కోట్లను అందుకున్నాడని సమాచారం. రేష్మ తండ్రి నగదు,ఆస్తులు,కార్ల రూపేణా లాంఛనాలను ఇచ్చారట. గోపీచంద్,రేష్మ దంపతులకు విరాట్ కృష్ణ అనే కొడుకు ఉన్నాడు.