Movies

శారద ఇప్పుడు ఏమి చేస్తుందో తెలుసా… ఎవరికి తెలియని నమ్మలేని నిజాలు..!!

నటించిన ప్రతి భాషలోనూ గొప్ప నటిగా పేరు తెచ్చుకోవటం ఆషామాషీ కాదు. కానీ తెలుగు గడ్డపై పుట్టిన శారద అది సాధ్యం చేసి చూపించారు. అంతేకాక మలయాళ చిత్రసీమలోను తనకు ఎవరు సాటిలేరని నిరూపించుకొని ఆ రాష్ట్ర ప్రభుత్వంచే ఊర్వశి అవార్డు అందుకుంది. అదీ ఒక్కసారి కాదు మూడు సార్లు ఊర్వశి పురస్కారాన్ని అందుకుంది.

శారద నటిస్తే అది నిజంగా నటన లేక నిజామా అనే విధంగా నటించేదట. మొదట్లో కామెడీ రోల్స్ చేసి ఆ తర్వాత హీరోయిన్ గా ఎదిగింది శారద. శారద స్వస్థలం గుంటూరు జిల్లా తెనాలి. ఆమె 1945 జూన్ 12 న జన్మించారు. ఆమె తండ్రి పేరు తాడిపత్రి వెంకటేశ్వర్లు, తల్లి కనకమ్మ. శారద తండ్రి కంసాలి. బంగారు నగలను తయారుచేసేవాడు.అయన మొదటి భార్య సరస్వతి. ఆమె పెళ్లి అయినా కొంత కాలానికి చనిపోవటంతో శారద తల్లి కనకమ్మను రెండో వివాహం చేసుకున్నాడు. శారద పుట్టగానే మొదటి భార్య పేరు సరస్వతి అని నామకరణం చేసాడు. శారద తండ్రి బర్మా వెళ్లి వ్యాపారం చేద్దామని అనుకున్నాడు. కుదరక కొంత కాలం చెన్నైలో ఉండిపోయాడు.

చెన్నైలో ఉండలేక చివరకు తెనాలి తిరిగి వచ్చేసాడు. శారద చిన్నప్పటి నుండి భరతనాట్యం నేర్చుకుంది. అయితే ఆమె తల్లి 14 సంవత్సరాల వయస్సులో శారదను నాటకాల గ్రూప్ లో జాయిన్ చేసింది.ఆ రోజుల్లో అది ఎంతో విప్లవాత్మక నిర్ణయం. ఎందుకంటే ఆ రోజుల్లో 10 సంవత్సరాలు వచ్చేసరికి బాల్య వివాహాలు చేసేసేవారు. అలాంటిది శారద కోరిక మేరకు శారద తల్లి శారదను నాటకాల వైపుకు తీసుకువెళ్ళింది.రక్త కన్నీరు నాటకంలో శారద నాగభూషణం భార్యగా నటించి నటన జీవితానికి శ్రీకారం చుట్టింది. ఆలా ఎన్నో నాటకాల్లో నటించింది. 1955 లో కన్యాశుల్కం సినిమాలో బాలనటిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.

1975 లో కేరళకు చెందిన ఒక వ్యక్తిని పెళ్లి చేసుకున్న శారద మలయాళ చిత్ర పరిశ్రమకు తరలి వెళ్ళింది. అక్కడ అనేక సినిమాల్లో నటించి ఎన్నో అవార్డు లను సాధించి తిరుగులేని నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఆ తర్వాత తెలుగు,హిందీ భాషల్లో కూడా ఎన్నో సినిమాల్లో నటించింది. ఈ సమయంలోనే మొదటి భర్తకు విడాకులు ఇచ్చి తెలుగు హాస్య నటుడు చలంను పెళ్లి చేసుకుంది. వీరి కాపురం కూడా ఎక్కువ కాలం నిలవలేదు.

మళ్ళీ సినిమాల్లోకి వచ్చి బిజీగా మారిపోయింది. ఇక సినిమాల్లో సంపాదించినా డబ్బుతో లోటస్ చాకోలెట్ కంపెనీ పెట్టింది. నష్టాలు రావటంతో ఆ కంపెనీని అమ్మేసి ఊపిరి పీల్చుకుంది. 1996 లో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. టీడీపీ తరుపున తెనాలి లోక్ సభకు పోటీ చేసి ఘన విజయం సాధించింది. ఆ సమయంలో తెనాలిలో ఎన్నో అభివృద్ధి పనులను చేసి అందరితో ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత ఎన్నికల్లో ఓడిపోయింది. దాంతో టీడీపీ నుండి కాంగ్రెస్ లోకి జంప్ అయింది.

ఇక మరల సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చి సినిమల్లో నటిస్తుంది. శారదకు పిల్లలు లేకపోవటంతో తమ్ముడు కుటుంబమే తన కుటంబంగా భావిస్తూ ఉంది. ప్రసుతం తనకు తోచిన రీతిలో సేవా కార్యక్రమాలను చేస్తూ పేదవారికి ఆసరాగా నిలుస్తుంది శారద.