యంగ్ లుక్ లో కేటీఆర్ – వైరల్ అవుతున్న అరుదైన ఫోటో…ఒక లుక్ వేయండి
తెరాస పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సామజిక మాంద్యమాల్లో ఎప్పటికప్పుడు స్పందిస్తూ, ఎంతో ఆక్టివ్ గా కనిపిస్తారు… ఏవైనా సమస్యలు తనకి ఎదురైతే తక్షణమే స్పందిస్తూ, తనవంతుగా సహాయ సహకారాలు అందిస్తూ అందరికి ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటారు కేటీఆర్… అదేవిధంగా తనకి సంబందించిన కొన్ని అరుదైన ఫోటోలను తన అధికారిక ట్విట్టర్ ద్వారా షేర్ చేస్తూ ప్రజలందరినీ కూడా సర్ప్రైజ్ చేస్తుంటారు కేటీఆర్… కాగా ఈమేరకు కేటీఆర్ తనకి సంబందించిన ఒక అరుదైన ఫోటోని షేర్ చేశారు.
ఆ ఫోటో 20 ఏళ్ళ క్రితం ప్రేమికుల రోజు నాడు తన స్నేహితుడితో కలిసి దిగారంట… కాగా ఈ ఫొటోలో కేటీఆర్ ఎంతో యంగ్ లుక్ తో డైనమిక్ గా కనిపిస్తున్నారు… డెనిమ్ షర్టులో, మోడ్రన్ హెయిర్ స్టయిల్ తో ఉన్న కేటీఆర్ మరో ఫ్రెండ్ తో కలిసి ఆ ఫొటో దర్శనమిస్తున్నారు. అయితే ప్రేమికుల రోజు హీరో కునాల్ లాంటి హెయిర్ స్టైల్ తో, అది కూడా ప్రేమికుల రోజు నాదే ఆ ఫోటోను తీసుకోవడం గమనార్హం…