Movies

బ్రహ్మానందం ఎన్ని ఆస్తులు సంపాదించాడో తెలిస్తే షాక్ అవుతారు

ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం గురించి తెలియని వారు అంటూ ఎవరూ వుండరు .తెలుగులో వెయ్య సినిమాలకు పైగా చేసి గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించుకున్నారు . బ్రహ్మి గా షార్ట్ కట్ లో పిల్చుకునే బ్రహ్మానందం టాలీవుడ్ ని నిన్నటివరకూ టాప్ కమెడియన్ గా తన పంధాను కొనసాగించారు . అగ్రహీరోలు సైతం తమ సినిమాల్లో బ్రహ్మానందం ఉండాలనే నిబంధన పెట్టి అతడు లేకపోతే సినిమాలు చేయం అనే సందర్భాలు కూడా లేకపోలేదు. దీన్ని బట్టి బ్రహ్మానందం రేంజ్ ఏమిటో వేరే చెప్పక్కర్లేదు. ఇక చిన్న సినిమాల్లో సైతం బ్రహ్మానందం ఉంటే చాలు మినిమమ్ రిజల్ట్స్ ఖాయమని అతడి కోసం వెయిట్ చేసేవారు నిర్మాతలు.

మొత్తమ్మీద టాలీవుడ్ లో బ్రహ్మానందం హాస్యం ఒక వ్యసనం లా మారింది .బ్రహ్మీ తెర మీద ఉన్నంత సేపు అభిమానులు కడుపుబ్బా నవ్వేవారు. చిన్న చిన్న పాత్రలు చేసిన బ్రహ్మానందం టాలీవుడ్ అత్యధిక సినిమాలు చేసిన హాస్యనటుడు స్థాయికి ఎదిగారు. ఒకప్పుడు ఏ హీరోకి లేని స్థాయిలో క్షణం తీరికలేకుండా మోస్ట్ బిజీ ఆర్టిస్ట్ గా బ్రహ్మానందం వెలిగాడు

ఇక పారితోషికం కూడా అదే రేంజ్ లో ఉండేది. ఎందుకంటే, గంటకు రూ 5లక్షలు తీసుకునేవారని అప్పట్లో మీడియా కోడై కూసింది. ఇక అతడి సంపాదన గురించి ఓ ఆంగ్ల పత్రిక ఇటివలే ఇచ్చిన వివరాలు చుస్తే, ఎవరికైనా కళ్ళు తిరగడం ఖాయం. జూబిలీ హిల్స్ లో ఇంద్రభవనం లాంటి ఖరీదైన ఇల్లు, హైదరాబాద్ ఔట్ కట్స్ లో ఫామ్ హౌస్, ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో గల అతడి సొంత ఊళ్ళో ఎకరాలకు ఎకరాలకు పొలాలు అతడి సొంతం.

సిటీ లోకి కొత్తగా ,లేటెస్ట్ గా వచ్చిన ఏ కారు అయినాసరే అతడి ఇంట్లో ఉండాల్సిందే. ఆడి అరైట్,ఆడి క్యూ సిక్స్,బెంజ్ లాంటి కార్లు ఎన్నో అతడి ఇంటి ముందు కనిపిస్తాయి. ఇలా అతడి ఆస్థి 320 కోట్ల రూపాయలకు పైనే వుంటుందని అంచనా.అయితే ఒకప్పుడు తినడానికి కూడా ఖాళీ లేనంతగా బిజీ ఆర్టిస్ట్ గా గడిపిన బ్రహ్మానందం ఈ మధ్య ఒక్కసారిగా డౌన్ లోకి వచ్చేసారు.

ఇప్పుడు బ్రహ్మీ సినిమాల్లో పెద్దగా కనిపించడం లేదు.అప్పుడో ,ఎప్పుడో అల ఒక సినిమాలో మెరుస్తున్నారు అంతే . ఇప్పుడు పరిశ్రమలోకి జబర్దస్త్ లాంటి ప్రోగ్రామ్స్ ద్వార ఎందరో కమెడియన్స్ మార్కెట్ లోకి రావడంతో బ్రహ్మానందానికి డిమాండ్ పడిపోయింది. ముఖ్యంగా బ్రహ్మానందం కి ఇచ్చే రెమ్యునరేషన్ ఇస్తే ఇద్దరు ముగ్గురు కమెడియన్స్ ని పెట్టుకోవచ్చనే భావించడం కూడా మరో కారణం.
ఇప్పుడు బ్రహ్మానందం ఇంట్లోనే ఎక్కువ సమయం వెచ్చిస్తూ, కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతూ,ఖరీదైన జీవితం, క్వాలిటీగా ఎంజాయ్ చేస్తున్నాడు. మూడు దశబ్దాల పాటు కామెడీ రారాజు గా తెలుగు చిత్రసీమలో వెలుగొందిన కామెడీ కింగ్ బ్రహ్మానందం తెలుగు వారందిరికీ ఆదర్శం,గర్వకారణం.