ఆ ఒక్క క్యారెక్టర్‌లో నటించిన ఆరుగురు హీరోలు….ఆ క్యారెక్టర్ ఏమిటో తెలుసా?
సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సినిమాలకు రాజకీయాలకు అవినాభావ సంబంధం వుంది. ఇక్కడ నటించిన నటీనటులు ఎందరో రాజకీయాల్లో రాణించారు. ఇందులో మరికొంత మంది నటీనటులు సినిమాల్లో రాజకీయ నాయకుల పాత్రలను పోషించారు. అందులో ఈ ఆరుగురు హీరోలు తెలుగు తెరపై ముఖ్యమంత్రి పాత్ర పోషించారు. వారెవరో మీరు కూడా చూడండి…
విశ్వ విఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చి రికార్డు టైమ్‌లో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహిచారు.
రియల్ లైఫ్‌లో సీఎం అయిన ఎన్టీఆర్…రీల్ లైఫ్‌లో ఆ క్యారెక్టర్ చేయలేకపోయారు.
కానీ ఆయన సమకాలీన నటులు…ఆ తర్వాత తరం వారు సీఎం పాత్రలో అలరించారు.
1984లో విడుదలైన ‘ముఖ్యమంత్రి’ సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ టైటిల్ పాత్రైన ముఖ్యమంత్రి పాత్ర పోషించారు.
1989లో విడుదలైన ‘రాజకీయ చదరంగం’ మూవీలో ఏఎన్నార్ సీఎంగా కనిపించారు.
1999లో శంకర్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ‘ఒకే ఒక్కడు’లో అర్జున్ ముఖ్య మంత్రిగా అదగొట్టాడు.
2009లో వి. సముద్ర దర్శకత్వంలో వచ్చిన ‘అధినేత’లో జగపతిబాబు సీఎం క్యారెక్టర్ చేసారు.
2010లో శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో హీరోగా నటించిన మొదటి సినిమాలోనే రానా సీఎం క్యారెక్టర్‌లో అదరగొట్టాడు.
2018లో కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ‘భరత్ అను నేను’ మూవీలో మహేశ్ ముఖ్యమంత్రిగా కనిపించారు.