Movies

గ్యాంగ్ లీడర్ నాని కాకుండా వేరే హీరో చేసుంటే….

మొన్న రిలీజైన నాని గ్యాంగ్ లీడర్ వీకెండ్ మొత్తాన్ని తన గుప్పిట్లోకి తీసుకుంది. పోటీ ఏదీ లేకపోవడం బాలీవుడ్ లో వచ్చిన డ్రీం గర్ల్ – సెక్షన్ 375లకు డివైడ్ టాక్ రావడం మల్టీ ప్లెక్సుల పరంగా బాగా హెల్ప్ అవుతోంది . స్టొరీ రివెంజ్ డ్రామానే అయినప్పటికీ దాన్ని ఐదుగురు లేడీస్ గ్యాంగ్ తో ముడిపెట్టి హీరో పాత్రను సరదాగా తీర్చిదిద్దిన తీరుకు విక్రం కుమార్ కు మంచి ప్రశంశలు దక్కుతున్నాయి. అయితే ఇందులో కొన్ని అంశాల గురించి మాత్రం నానిని ప్రత్యేకంగా మెచ్చుకోవచ్చు.ఇంటర్వెల్ నుంచి సెకండ్ హాఫ్ మొత్తం తనతో సమానంగా విలన్ కార్తికేయకు స్పేస్ ఉందని తెలిసి ఓకే చెప్పడం అందులో మొదటిది.

కథలో కీలక పాయింట్ తన మీద కాకుండా ఇతర పాత్రల చుట్టూ అల్లుకున్నా దాని గురించి ఆలోచించకపోవడం రెండోది. ఇక మరొకటి ఎలాంటి మొహమాటం లేకుండా వెన్నెల కిషోర్ గే ఎపిసోడ్స్ ని చాలా ఈజ్ తో నడిపించడం. మాములుగా ఇలాంటి సీన్స్ లో స్టార్లు ఇబ్బంది పడతారు. కాని నాని అలాంటి ఫీలింగ్స్ ఏమి పెట్టుకోలేదు.అడిగి మరీ బలవంతంగా కమర్షియల్ సాంగ్స్ పెట్టించుకుంటున్న కొందరు యూత్ హీరోల ట్రెండ్ కు భిన్నంగా కేవలం సిచ్యువేషన్ కు తగ్గట్టు మాత్రమే పాటలు ఉన్నా ఎస్ చెప్పడం ఇంకో కారణంగా చెప్పొచ్చు. ఏది ఎలా ఉన్నా రిస్క్ చేసే విషయంలో నాని ఇప్పటికీ మారలేదని గ్యాంగ్ లీడర్ రుజువు చేసింది. జెర్సీలో కొడుకు కోసం ప్రాణం త్యాగం చేసే పాత్ర నుంచి లేడీస్ ని వెంటబెట్టుకుని పగ పగ అంటూ తిరిగే రోల్ చేయడం అందరి వల్లా అయ్యేది కాదు