Movies

మహేష్ బాబు క్రికెట్ ఆడకపోవడానికి,షర్ట్ తీయకపోవడానికి కారణం ఏమిటో తెలుసా…తెలిస్తే షాక్ అవుతారు!

సూపర్ స్టార్ కృష్ణ కొడుకుగా బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత రాకుమారుడిగా హీరోగా టర్న్ అయ్యి చాలా తక్కువ సమయంలోనే సూపర్ స్టార్ గా మారాడు మహేష్ బాబు. మహేష్ బాబు అన్న పేరు వినబడగానే అమ్మాయిలందరూ ఎగిరి గంతులేస్తారు. ఆయనకు మాములు ఫ్యాన్ ఫాల్లోవింగ్ లేదండోయ్ !…. . అయితే మన తెలుగు ఇండస్ట్రీ లో ఇప్పుడు ఉన్న హీరోలు దాదాపు అందరు షర్ట్ లేకుండా….కొన్ని సినిమాల్లో కనబడ్డారు. కానీ మన సూపర్ హీరో మహేష్ మాత్రం ఆలా ఎప్పుడు మనకు కనబడలేదు. దానికి కారణం ఏమిటా…. అన్న సందేహం ప్రశ్నలా మారింది.

దానికి సమాధానం ఏమిటంటే మహేష్ ఆయన చెన్నై లో చదువుకుంటున్నప్పుడు ఆయన క్రికెట్ చాలా బాగా ఆడేవారు. కానీ ఒక సారి తన బాడీ మీద రాష్ వచ్చింది. కృష్ణ గారు డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్లారు , డాక్టర్ ఇచ్చిన మందులు వాడాక రాష్ తగ్గింది. ఆ తరువాత యధావిధిగా క్రికెట్ ఆడడం మొదలుపెట్టారు.

అప్పుడు రాష్ మళ్ళీ రావడం తో ఇక కృష్ణ గారు ఆడటం మానేయమన్నారు. అప్పటినుండి మహేష్ ఎండలో షర్ట్ లేకుండా తిరగడం మానేశారు. ఆయన శరీరం లైట్ లో ఉండే వేడిని తట్టుకోలేదు. ఈ కారణం వల్లే మహేష్ ఆయన సినిమాల్లో ఎప్పుడు షర్ట్ లేకుండా కనబడరు.