Movies

పసివాడి ప్రాణంలో చిరు కొడుకు గుర్తు ఉన్నాడా…ఆమె ఇప్పుడు సీరియల్ స్టార్… ఎవరో?

మనకు సినిమాల్లో కనిపించే చిన్నారులు అమ్మాయిలా అబ్బాయిలా అనే విషయంలో ముందే ఒక నిర్ణయానికి రాకూడదు. ఎందుకంటే బాహుబలి సినిమాలో రమ్యకృష్ణ నీటిలో కాపాడే చిన్నారి ఎవరా అనే దానిపై చాలా రోజులు ఎన్నో ఊహాగానాలు సోషల్ మీడియాలో హల్ చల్ చేసాయి. రమ్య కృష్ణ చేతిలో ఉన్నది బాబు కాదని పాప అని ప్రచారం జరిగింది. ఇందులో ఎంత నిజం ఉందో ఎవరికీ తెలియదు. అయినా ఎవరి ఊహాగానాలు వారివే.

చిరంజీవి సూపర్ హిట్ సినిమా పసివాడి ప్రాణం సినిమాలోని బాబు ఒక పాప అని మనలో చాలా మందికి తెలియదు. ఈ సినిమాలో నటించిన రాజా అమ్మాయి. ఆ అమ్మాయి ఎవరో కాదు. కలిసివుందాం రా వంటి సూపర్ హిట్ సీరియల్స్ లో నటించిన సుజిత.

సుజిత తల్లితండ్రులు సినీ పరిశ్రమకు చెందిన వారు కావటంతో చిన్నతనం నుండి సినిమాల్లో నటించింది. సుజిత నటించిన పసివాడి ప్రాణం సినిమా చాలా పెద్ద హిట్ అయింది.ప్రస్తుతం సుజిత వదినమ్మ అనే సీరియల్ లో నటిస్తుంది. సీరియల్స్ లో చాలా బిజీగా ఉంటుంది సుజిత.