శ్రీదేవి డూప్ ఎవరో తెలుసా? మనకు తెలిసిన హీరోయినే
సినీ రంగంలో ప్రతి హీరోకు దాదాపుగా డూప్ అవసరం ఏర్పడుతుంది. స్టార్ హీరో అయినా అప్ కమింగ్ హీరో అయినా ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు డూప్ ల మీద ఆధారపడుతున్నారు. ఫైటింగుల్లో, రిస్కీ షాట్లలో ఎటువంటి రిస్క్ లేకుండా డూప్ లను పెట్టుకొని వారికి కూడా జీవనోపాధి కల్పిస్తున్నారు. మనకు హీరోలకు డూప్ లు ఉంటారని తెలుసు. హీరోయిన్స్ కి కూడా డూప్ లు ఉన్నారు. హీరోయిన్స్ కి అయితే ఎక్కువగా డ్యూయల్ రోల్ చేసినప్పుడు మాత్రమే డూప్ ల మీద ఆధారపడుతూ ఉంటారు.
‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సినిమా చేస్తున్నప్పుడు శ్రీదేవికి కూడా ఓ సందర్భంలో డూప్ కావాల్సివచ్చింది. ఆలా శ్రీదేవికి డూప్ గా నటించిన నటి ఎవరో తెలుసా? అదేనండి క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ. ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సినిమాలో శ్రీదేవికి హేమ డూప్ గా నటించింది.
అయితే అది కూడా ఒకే ఒక సన్నివేశంలో నటించింది. శ్రీదేవి ఈత కొలనులో ఉంటే… అమ్రిష్ పురి వచ్చే సీన్ గుర్తుంది కదా? శ్రీదేవికి ఈత రాదు. ఆ సమయంలో ఈత వచ్చిన అమ్మాయి అవసరం ఏర్పడింది. సరిగ్గా అదే రోజున ఊటీలో మరో సినిమా షూటింగ్ కోసం హేమ అక్కడికి దగ్గరలోనే ఉంది.
ఆ సినిమా షూటింగ్ నుంచి హేమను తీసుకువచ్చి శ్రీదేవికి డూప్ గా నటింపజేశారు. ఈత కొలనులో లాంగ్ షాట్‌లో ఉన్న సీన్స్ లో హేమ ఉన్నది. ఈ సారి జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా చూసినప్పుడు కాస్త పరీక్షగా చూస్తే మీకే అర్ధం అవుతుంది.
ఆ తర్వాత శ్రీదేవి- హేమ కలసి ‘క్షణం క్షణం’లో నటించారు. శ్రీదేవికి స్నేహితురాలిగా హేమ నటించారు. హేమ సమయం వచ్చినప్పుడల్లా శ్రీదేవికి డూప్ గా నటించానని చెపుతూనే ఉంటుంది.