జీమెయిల్‌తో ఎన్ని ఫీచర్స్ ఉంటాయో తెలుసా, వాటిల్లో సగం కూడా మీరు వాడటం లేదు.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం
ఒకప్పుడు జీమెయిల్ అంటే కేవలం ఒకరి నుండి ఒకరికి మెయిల్స్‌ను మోసుకు వెళ్లేది మాత్రమే.కాని గూగుల్ జీమెయిల్‌ను అత్యాధుని పీచర్స్‌తో అద్బుతమైన సెక్యూరిటీతో తీసుకు వచ్చింది.జీమెయిల్‌లో ఎన్నో మార్పులు వచ్చాయి..
ఒకప్పుడు జీమెయిల్‌లో 2 జీబీ వరకు మాత్రమే ఉచిత స్పేస్ ఇచ్చేవారు.ఆ తర్వాత ఎక్కువ స్పేస్ కావాలనుకున్న వారు భారీ మొత్తంలో ఖర్చు చేయాల్సి వచ్చేది.కాని ప్రస్తుత పరిస్థితి మారింది.2 జీబీ స్పేస్ ఏ మూలకు సరి పోవడం లేదు.దాంతో ఏకంగా 15 జీబీకి పెంచారు.15 జీబీ వరకు ఉచితంగా ఇచ్చే జీమెయిల్ అదనపు స్పేస్ కోసం కూడా కొద్ది మొత్తంలోనే వసూళ్లు చేస్తుంది.
ఇక జీమెయిల్‌లో ఉన్న ఇతర ఫీచర్స్ విషయానికి వస్తే
గూగుల్ ఫొటోస్.ప్రతి స్మార్ట్ ఫోన్ యూజర్ ఈ విషయాన్ని తప్పకుండా తెలుసుకోవాలి.కాని కేవలం 25 శాతం స్మార్ట్ ఫోన్ యూజర్లు మాత్రమే దీన్ని వాడుతున్నారు.మనం ప్రతి రోజు స్మార్ట్ ఫోన్‌లో ఏదో ఒక ఫొటో దిగడం లేదంటే ముఖ్యమైన వీడియోను సేవ్ చేసుకోవడం, ఇంకేదైనా ఫైల్‌ను సేవ్ చేసుకుంటాం.కీలకమైన ఫొటోలు, వీడియోలు ఉన్న ఫోన్ మిస్ అయితే డేటా అంతా పోతుంది.
అదే ఫోన్‌ను గూగుల్ ఫొటోస్‌తో సింక్ చేస్తే మనం తీసుకునే ప్రతి ఫొటో కూడా వెంట వెంటనే గూగుల్ డ్రైవ్‌లోకి వెళ్లి పోతుంది.ఫోన్ పోయినా మరే డివైజ్‌లోకి వెళ్లయినా ఆ ఫొటోలను మరియు వీడియోలను చూసుకోవచ్చు.
గూగుల్ డ్రైవ్.ఇది నిజంగా అత్యధ్బుతమైన టూల్.కంప్యూటర్ మరియు స్మార్ట్ ఫోన్ ఇలా ఎందులో అయినా దీనిని యాక్సిస్ చేసుకోవచ్చు.ఏదైనా ఆఫీస్ పనికి అయినా లేదంటే మరేదైనా అవసరం కోసం తయారు చేసుకున్న డాక్యుమెంట్స్ లేదా మరేదైనా ఎక్స్‌ఎల్ షీట్‌ను తయారు చేసుకున్నప్పుడు దాన్ని ఎప్పుడు, ఎక్కడైనా యాక్సిస్ చేసుకుని దాన్ని ఎడిట్ చేసుకోవచ్చు.దీన్ని బిజినెస్ పర్సన్స్ ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.సాదారణ ఉద్యోగస్తులు కూడా ఈ పీచర్‌ను వాడుతున్నారు…
ఇంకా గూగుల్ కాలెండర్, రిమైండర్ కూడా అత్యంత ఉపయోగపడే పీచర్స్.
మొబైల్‌లోని కాంటాక్స్ ఎన్నో ఉంటాయి.అవి ఫోన్ పోయిన సందర్బంలో మొత్తం పోతాయి.అదే గూగుల్ డ్రైవ్‌కు ఫోన్ కాంటాక్ట్స్‌ను యాక్సెస్ చేస్తే ఫోన్ పోయినా కాంటాక్ట్స్ అనేవి గూగుల్‌లో భద్రంగా ఉంటాయి.
మొత్తానికి గూగుల్ వల్ల ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక రకంగా ఉపయోగం పొందవచ్చు.ఇప్పటికే గూగుల్ సెర్చ్‌తో ఎంతో ఉపయోగపడుతుంది.ఇంకా ఇలాంటి పీచర్స్‌తో మరింతగా ఉపయోగదాయకంగా ఉంటుంది.