Politics

శివప్రసాద్ లవ్ స్టోరీ..బ్లాక్ బస్టర్ బొమ్మ

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత శివప్రసాద్ శనివారం చైన్నై అపోలో హాస్పెటల్ లో కన్నుమూశారు. గత కొద్దీ రోజులుగా ఆరోగ్యం సరిగ్గా లేకపోవటంతో హాస్పెటల్ లో జాయిన్ చెప్పించారు. ఆయనకి భార్య విజయలక్ష్మి, ఇద్దరు కూతురులు ఉన్నారు. వాళ్ళందరూ డాక్టర్లు. వాళ్ళ ఆవిడా కూడా డాక్టర్.. నిజానికి శివ ప్రసాద్ ది ప్రేమ వివాహం. 1972 లోనే కులాంతర వివాహం చేసుకొని అందరికి షాక్ ఇచ్చాడు.

ఆరవ తరగతిలో చంద్రబాబు,శివ ప్రసాద్ ఇద్దరు క్లాస్ మేట్స్, ఆ తర్వాత బాబు ఆర్ట్స్ లోకి వెళ్ళిపోయాడు . శివ ప్రసాద్ మెడిసిన్ వైపు వెళ్లారు. మెడిసన్ మొదటి ఏడాదిలో క్లాస్ మేట్ విజయలక్ష్మితో ప్రేమ మొదలైంది. క్లాస్ లో ఎప్పుడు సరదాగా ఉండే శివ ప్రసాద్ అంటే ఆమెకి ఇష్టం. మొదటిగా శివ ప్రసాద్ ప్రపోజ్ చేశాడు. అయితే శివ ప్రసాద్ ది తక్కువ కులం కావటంతో విజయలక్ష్మి తరుపు వాళ్ళు ఏమైనా చేస్తారేమో అనే భయం శివ ప్రసాద్ లో ఉండేది.

శివ ప్రసాద్ వాళ్ళ నాన్న గారు కూడా శివ ప్రసాద్ కి చాలా సార్లు కూర్చోబెట్టి చెప్పాడు, కానీ ఆయన వినలేదు, ఒక రోజు డైరెక్ట్ గా విజయలక్ష్మిని తీసుకోని శివప్రసాద్ వాళ్ళ నాన్న దగ్గరకి తీసుకోని వెళ్ళాడు. దీనితో ఖంగారు పడిన శివప్రసాద్ వాళ్ళ నాన్న ఎవరికీ తెలియకుండా రహస్యంగా పెళ్లిచేశాడు. వాళ్ళకి డిగ్రీ చేతికి వచ్చేసరికి ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. ఈ విషయాలు అన్ని శివప్రసాద్ గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు.