Movies

నటుడు వేణుమాధవ్ 10 ఇళ్లకు పెట్టిన పేరు ఎవరిదో తెలిస్తే షాకవుతారు..

టాలీవుడ్ హాస్య నటుడు వేణు మాధవ్ నిన్న మధ్యాహ్నం 12 గంటల సమయంలో కన్ను మూసారు. అయన మృతి పట్ల టాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. ఇదిలా ఉంటే వేణు మాధవ్ కి సంబందించిన ఒక విషయం ఆసక్తికరంగా మారింది. వేణు మాధవ్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. కాలేయ సంబంధింత వ్యాధితో బాధపడుతూ చికిత్స తీసుకుంటూ నిన్న మధ్యాహ్నం తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. s.v. కృష్ణా రెడ్డి తెరకెక్కించిన సంప్రదాయం సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చాడు వేణు మాధవ్. సినిమాల్లోకి రాకముందు మిమిక్రి ఆర్టిస్ట్ గా రాణించాడు.

నిర్మాత అచ్చిరెడ్డి, దర్శకుడు కృష్ణా రెడ్డి, తల్లి ప్రోద్భలంతో సినిమాల్లోకి వచ్చిన వేణు మాధవ్ టాప్ కమెడియన్ గా ఎదిగాడు. వేణు మాధవ్ సందర్భం వచ్చినప్పుడల్లా తాను ఇంత బాగా బ్రతకటానికి కారణం నిర్మాత అచ్చిరెడ్డి, దర్శకుడు కృష్ణా రెడ్డి అని చెప్పుతూ ఉంటారు. అందుకే వేణు మాధవ్ తన పది ఇల్లులకు వారి ఇద్దరి పేర్లు కలిసి వచ్చేలా పెట్టుకున్నాడు. వేణు మాధవ్ తన ఇంటికి వారి పేర్లు పెట్టుకోవాలని ఆలోచన వచ్చినప్పుడు నటుడు ఉత్తేజ్ కి చెప్పాడట. అప్పుడు ఉత్తేజ్ “అచ్చి వచ్చిన కృష్ణ నిలయం” అని పేరు పెట్టుకోమని సూచించాడట. దాంతో ఆ పేరు వేణు మాధవ్ కి నచ్చటంతో తనకు ఉన్న పది ఇళ్లకు ఆ పేరే పెట్టేసాడట. తనకు లైఫ్ ఇచ్చిన దర్శక,నిర్మాతలకు ఈ విధంగా వేణు మాధవ్ కృతజ్ఞత చెప్పుకున్నాడు.