Movies

కోడి రామకృష్ణ తలకు కట్టుకున్న బ్యాండ్ వెనుక ఉన్న అసలు కథ

సినీ పరిశ్రమలో కొంచెం సేంట్ మెంట్స్ ఎక్కువే అని చెప్పాలి. అందులోను పాత తరం వారికి మరీ ఎక్కువ. సీనియర్ దర్శకుడు కోడి రామకృష్ణకు ఉన్న సేంట్ మెంట్ గురించి మనకు తెలిసిందే. అయన ఎప్పుడు తలకు క్లాత్ కట్టుకొనే కన్పిస్తూ ఉంటారు. అలాగే చేతికి చాలా దారాలు,ఉంగరాలు కన్పిస్తాయి. దారాలు,ఉంగరాల సంగతి ఆలా వదిలేస్తే అందరి దృష్టిని ఆకర్షించేది తలకు కట్టిన క్లాత్. అయన దశాబ్దాలుగా హెడ్ బ్యాండ్ ని వదలటం లేదు. ఆలా ఆయనకు హెడ్ బ్యాండ్ కట్టటం ఎలా అలవాటు అయిందో…హెడ్ బ్యాండ్ సేంట్ మెంట్ ఏమిటో తెలుస్కుందాం. దీని గురించి అయన మాటల్లోనే…అప్పట్లో ఒక సినిమా అవుట్ డోర్ షూటింగ్ సమయంలో విపరీతమైన ఎండ కాస్తుంది.

సెట్ లో ఉన్న ఒక వ్యక్తి నా నుదిటిన ఎండ బాగా ఎక్స్ పోజ్ అవుతుందని క్లాత్ కట్టుకోమని చెప్పాడు. నేను కట్టుకున్నాను. అందరు బాగుందని అన్నారు. మరుసటి రోజు షూటింగ్ కి వచ్చే సమయానికి చాలా అందంగా రుమాలుతో హెడ్ బ్యాండ్ తయారుచేసి పెట్టారు. అది పెట్టుకొని కొన్ని రోజుల పాటు షూటింగ్ చేశాను. అందరికి నన్ను ఆలా చూడటం అలవాటు అయింది. నాకు బాగానే ఉందని కంటిన్యూ చేశాను.

అందరూ నాకు ఆ బ్యాండ్ తో అనుబంధం ఉందని అన్నారు. తర్వాత అది సేంట్ మెంట్ గా మారిపోయింది. ఒకసారి షూటింగ్ లో ఉండగా బాలచందర్ గారు వచ్చారు. నన్ను కదలవద్దని చెప్పారు. నేను అప్పుడు రంగు రంగు పూలతో ఉన్న హెడ్ బ్యాండ్ పెట్టుకున్నాను.

దాని మీదకు సీతాకోకచిలుక వచ్చి వాలింది. అందుకే బాలచందర్ గారు కదలవద్దని అన్నారు. అప్పుడు బాలచందర్ గారు కూడా నాకు,ఈ బ్యాండ్ కి ఎదో అనుబంధం ఉందని అన్నారు. సేంట్ మెంట్ మరింత బలపడింది. అప్పటి నుంచి బ్యాండ్ లేకుండా బయటకు రాలేదని కోడి రామకృష్ణ గారు చెప్పారు.