ఈ నందమూరి హీరో గుర్తు ఉన్నాడా….తండ్రి కోసం సినిమాలను త్యాగం చేసి ఇప్పుడు ఏమి చేస్తున్నాడో తెలుసా?
నట వారసత్వంగా సినీ రంగప్రవేశం చేసి ఆ తర్వాత సొంత ఇమేజ్ తో ఎదిగేవాళ్ళు కొందరైతే,ఛాన్స్ లొచ్చినా నిలబెట్టుకోలేని వాళ్ళు మరికొందరు ఉన్నారు. ఇక స్టార్ హీరోగా ఆడియన్స్ మన్ననలు అందుకుంటున్న తరుణంలో సపోర్టింగ్ క్యారెక్టర్స్ కూడా వేస్తూ,ఓ మంచి నటుడుగా అందరి మన్ననలు అందుకుంటూ చివరికి తండ్రికోసం నటనా రంగానికి గుడ్ బై చెప్పేసాడు ఓ హీరో. చివరికి తండ్రిని పోగొట్టుకుని షాక్ తిన్న అతడు మళ్ళీ సినీ రంగం వైపు కన్నెత్తి చూడలేదు. తొలి సినిమాతోనే సూపర్ డూపర్ హిట్ అందుకున్న ఆ హీరో ఆ తర్వాత మామ కోడళ్ల సవాల్,ఇంటిదొంగ, తలంబ్రాలు,రౌడీ బాబాయ్,మేనమామ,కృష్ణలీల,ప్రేమకిరీటం,బాలమురళీ కృష్ణ ఇలా ఏడాదికి నాలుగైదు సినిమాలతో దూసుకెళ్లాడు.
ఇంతకీ అతనెవరంటే, నందమూరి కల్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు కుమారుడైన కల్యాణ చక్రవర్తి హీరోగా కెరీర్ స్టార్ట్ చేసి ,విజయాలు నమోదుచేసుకుని కూడా సపోర్టింగ్ యాక్టర్ గా నటించి మన్ననలు అందుకున్నాడు.హీరోగా బిజీగా గల రోజుల్లో లంకేశ్వరుడు మూవీలో చిరంజీవితో కల్సి సపోర్టింగ్ యాక్టర్ గా కల్యాణ చక్రవర్తి నటించాడు. అయితే అతని తండ్రి హాస్పిటల్ పాలవ్వడంతో చెన్నై వెళ్లి తండ్రి ని చూసుకుంటూ గడిపేశాడు.
అదే సమయంలో చిత్ర పరిశ్రమ హైదరాబాద్ కి రావడం నేపథ్యంలో ఇక అతడు సినిమాల వైపు చూడలేదు. తల్లిదండ్రులకు లేకలేక పుట్టిన కల్యాణ చక్రవర్తి తండ్రికి సేవ చేస్తూ, నటనకు స్వస్తి చెప్పేసాడు. ఇక తండ్రి కూడా చనిపోవడంతో కోలుకోలేని షాక్ తిన్నాడు. కోలుకోడానికి చాలాకాలం పట్టేసింది. నిజానికి కొడుకు పేరుతొ విజయవాడలో త్రివిక్రమరావు ఓ థియేటర్ కట్టించి దానికి కల్యాణ చక్రవర్తి అనే పేరు పెట్టాడు. ఇలా కొడుకు పేరుతొ థియేటర్ ఉన్నది అదొక్కటే.
అయితే ఇప్పుడు దాన్ని కమర్షియల్ కాంపెక్స్ గా మార్చేసి,కళ్యాణ్ చక్రవర్తి దగ్గరుండి చూసుకుంటున్నాడు. కోట్ల రూపాయల ఆస్తులను చూసుకుంటూ,సినిమా రంగానికి దూరమైన కళ్యాణ్ చక్రవర్తి, చివరకు తన పిల్లలను కూడా సినిమా రంగంవైపు తీసుకు రాలేదు. మొత్తానికి మంచి పేరున్న నటుడు ఇలా సినీ రంగానికి దూరమవ్వడం నిజంగా బాధాకరమే.