టీవీ9 నుండి తప్పుకున్న తర్వాత జాఫర్ ఏ ఛానెల్‌లో జాయిన్ అయ్యాడో తెలుసా?
టీవీ9 ఆరంభం నుండి కూడా న్యూస్ రిపోర్టర్‌గా.టాక్ షో హోస్ట్‌గా.న్యూస్ ప్రజెంటర్‌గా.చర్చ కార్యక్రమాల్లో వ్యాఖ్యాతగా ఇలా పలు విధాలుగా పని చేసిన జాఫర్ ఇటీవలే ఆ ఛానెల్ నుండి తొలగించబడ్డాడు.
రవి ప్రకాష్ టీవీ9 నుండి దూరం అయిన తర్వాత ఆయనకు ఆప్తుడు మిత్రుడు అంటూ పేరున్న కారణంగా జాఫర్‌ను టీవీ9 యాజమాన్యం తొలగించింది అంటూ కొందరు చెప్పుకొచ్చారు.ఆ విషయం నిజమే అంటూ సమాచారం కూడా అందుతోంది.జాఫర్‌కు ఇంటి పేరుగా టీవీ9 మారిపోయింది.జాఫర్ అంటే ఎవరు గుర్తు పట్టరు టీవీ9 జాఫర్ అంటే ఠక్కున గుర్తు పడతారు.
అంతగా టీవీ9 తో విలీనం అయిన జాఫర్ అక్కడ నుండి బయటకు వచ్చిన తర్వాత ఏ ఛానెల్‌లో చేస్తాడు అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూశారు.దాదాపు నెల రోజుల తర్వాత జాఫర్ తాను టీవీ5లో జాయిన్ అయినట్లుగా ప్రకటించాడు.ఈ విషయాన్ని స్వయంగా ఆయనే సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నాడు.ఇటీవల బిగ్‌బాస్‌లో కూడా ఈయన రెండు వారాల పాటు ఉండి అందరి దృష్టిని ఆకర్షించాడు.అందరిని ఆకట్టుకున్న జాఫర్ ఇకపై టీవీ5లో కూడా ఆకట్టుకునే షోలు మరియు కార్యక్రమాలు చేస్తాడని ఆశిద్దాం.